Deepika Kumari : దీపిక కుమారికి మహేష్ విషెస్.. ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్‌లో చరణ్..

ఇండియన్ ఆర్చరీ మహిళా టీమ్ తరపున స్వర్ణం సాధించిన దీపిక కుమారికి భారతదేశ క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు..

Ram Charan Rrr Shooting Pics And Mahesh Babu Wishes To Deepika Kumari

Deepika Kumari: ఇండియన్ ఆర్చరీ మహిళా టీమ్ తరపున స్వర్ణం సాధించిన దీపిక కుమారికి భారతదేశ క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

‘ఉత్తేజకరమైన మరియు నమ్మశక్యం కాని విజయం! ఆర్చరీ ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించినందుకు దీపిక కుమారికి మరియు జట్టు సభ్యులకు అభినందనలు’ అంటూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

RRR Movie : డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్.. 10 భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న ‘ఆర్ఆర్ఆర్’..!

‘బాహుబలి’ రెండు పార్టులతో తెలుగు సినిమా స్థాయిని పెంచి, తెలుగు సినిమా సత్తా ఇదీ అని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో మన తెలుగు సినిమా రేంజ్‌ని మరింత పెంచబోతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్లు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. చెర్రీ, తారక్ ఇద్దరూ షూటింగులో పాల్గొంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ లొకేషన్‌లో కూల్ లుక్‌లో స్టైలిష్‌గా ఉన్న చరణ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.