×
Ad

Game Changer Update : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. షూటింగ్ మొదలు.. ఎక్కడో తెలుసా?

తాజాగా అభిమానులు కాస్తో కూస్తో కూల్ అయ్యే అప్డేట్ 'గేమ్ ఛేంజర్ మూవీ నుంచి వచ్చింది.

  • Published On : November 23, 2023 / 09:35 AM IST

Ram Charan Shankar Game Changer Movie Shooting Update

Game Changer Update : రామ చరణ్(Ram Charan) RRR సినిమా తర్వాత ఆచార్య సినిమాలో కనిపించాడు. ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో చరణ్ నెక్స్ట్ సినిమాపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. చరణ్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతుంది. కానీ ఇప్పటిదాకా సినిమా టైటిల్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ఎప్పుడో ప్రకటించారు. కానీ అది అవ్వదని అందరికి క్లారిటీ వచ్చేసింది. శంకర్ ఇండియన్ 2 సినిమాకి పనిచేస్తూ మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాకి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ షూట్ రెండేళ్లుగా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేస్తామని అప్డేట్ ఇచ్చి మళ్ళీ వాయిదా వేశారు. దీంతో అభిమానులు మూవీ యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అభిమానులు కాస్తో కూస్తో కూల్ అయ్యే అప్డేట్ మూవీ నుంచి వచ్చింది. గేమ్ ఛేంజర్ షూట్ మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు. మైసూరులో ఈ సినిమా షూట్ ఈ వారం నుంచి జరగబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా చరణ్ హైదరాబాద్ నుంచి మైసూర్ కి ఫ్లైట్ లో వెళ్ళాడు. హైదరాబాద్, మైసూర్ ఎయిర్ పోర్ట్ లో చరణ్ విజువల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో హమ్మయ్య.. ఇప్పటికైనా షూట్ మొదలుపెట్టారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు.

Also Read : Maanas : పెళ్లి పీటలెక్కిన మానస్.. ఘనంగా సీరియల్ నటుడు మానస్ వివాహం..

గేమ్ ఛేంజర్ సినిమా మాత్రం వచ్చే సంవత్సరమే సమ్మర్ తర్వాత విడుదల అవుతుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి ఇప్పటికైనా అప్డేట్స్ ఇస్తారా లేదా చూడాలి గేమ్ ఛేంజర్ చిత్రయూనిట్.