RC 15: చెర్రీ-శంకర్ మూవీ టెస్ట్ షూట్ స్టార్ట్.. రేపే లాంచింగ్!

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమా బుధవారం మొదలుకానుంది. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా..

Rc 15

RC 15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ మొదలు కానుంది. చెర్రీ ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తిచేసి తండ్రి మెగాస్టార్ తో కలిసి ఆచార్య సినిమా బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నాడు. దీంతో పాటే సౌత్ స్టార్ దర్శకుడు శంకర్ తో కలిసి మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాకు సిద్దమయ్యాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమా బుధవారం మొదలుకానుంది. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీని ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ సినిమా లుక్ కోసం హీరో చరణ్, హీరోయిన్ కియారా పై ఈరోజె టెస్ట్ షూట్ జరుగుతుండగా రేపు అధికారికంగా లాంఛన ప్రారంభం జరగనుంది. ఈ సినిమాకు ముహూర్తం కూడా సినిమాకి తగ్గట్లే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా పలువురు స్పెషల్ గెస్ట్ లు ఈ వేడుకలో మెరవనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ చేతిలో మరో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నా వాటిని పక్కనపెట్టి మరీ చరణ్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.

శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2తో పాటు అపరిచితుడు హిందీ రీమేక్ ను కూడా సెట్స్ మీదకి తెచ్చాడు. ఈ సినిమాలపై వివాదాలు నెలకొన్నా చరణ్ సినిమా కన్నా ముందే తమ సినిమా పూర్తిచేయాలని ఇండియన్ 2 సినిమా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కోర్టులకెక్కినా శంకర్ వాటిని పక్కనపెట్టి మరీ రామ్ చరణ్ సినిమాను ముందుకు తెచ్చాడు. దిల్ రాజు అండ్ కో ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ లో శంకర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుండగా సంగీత దర్శకుడిగా థమన్ ను ఇప్పటికే ఎంచుకున్నారు.