Ram Charan : గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్, బ్రహ్మానందం ఫొటో.. చరణ్ కొత్త లుక్ చూశారా?

తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్.. బ్రహ్మానందంతో దిగిన ఫొటో పోస్ట్ చేశాడు.

Ram Charan Shares Special Photo with Brahmanandam from Game Changer Sets

Ram Charan Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం శంకర్(Shankar) దర్శకత్వంలో పాన్ ఇండియా భారీ ప్రాజెక్టుగా ప్రకటించారు ఈ సినిమాని. కానీ ఇప్పటిదాకా ఒక్క పోస్టర్ తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి లీక్ అయిన వీడియోలు, ఫొటోలు చూసి కాసేపు సంతోషపడటం తప్ప చరణ్ అభిమానాలు ఈ సినిమా విషయంలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ అయిపోవడంతో శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూట్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో బ్రహ్మానందం(Brahmanandam) కూడా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి చరణ్.. బ్రహ్మానందంతో దిగిన ఫొటో పోస్ట్ చేశాడు. బ్రహ్మానందం ఇటీవల ‘నేను – మీ బ్రహ్మానందం’ అనే పేరుతో తన ఆత్మకథని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో బ్రహ్మానందం తన చిన్ననాటి కష్టాలు, సినిమాలు, ఫ్యామిలీ.. ఇలా అన్ని విషయాల గురించి తెలిపారు.

బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. తాజాగా ఈ పుస్తకాన్ని బ్రహ్మానందం గేమ్ ఛేంజర్ సెట్లో రామ్ చరణ్ కి అందించారు. దీంతో బ్రహ్మానందం పుస్తకాన్ని అందిస్తున్న ఫొటోని చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. బ్రహ్మానందం గారి అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని ‘నేను’ పుస్తకంలో చాలా హాస్యంగా, హృదయానికి హత్తుకునేలా రాశారు. ఈ పుస్తకంలోని పేజీలు ఆయన మనకు అందించిన హాస్యం, జీవిత పాఠాలు.. అన్నిటిని చూపిస్తాయి. ఈ పుస్తకాన్ని అమెజాన్ లో ఆర్డర్ చేసుకోండి. అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Ruhani Sharma : విరాట్ కోహ్లీ ఈ హీరోయిన్ కి బావ అంట.. ఎలా? విరాట్ గురించి ఏమని చెప్పింది?

అయితే ఈ ఫొటోలో చరణ్ కొత్త లుక్ లో కనిపించాడు. ఈ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చరణ్ క్లీన్ షేవ్ తో, ఒత్తైన జుట్టుతో, ఫార్మల్ షర్ట్ వేసుకొని ఓ యువ రాజకీయ నాయకుడిలా ఉన్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చరణ్ కి సంబంధించి నాలుగైదు లుక్స్ లీక్ అవ్వడం, అందులో పొలిటికల్ లీడర్ లుక్ కూడా ఉండటంతో శంకర్.. చరణ్ ని ఎన్ని వేరియేషన్స్ తో చూపిస్తున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమా 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం.