RC 17 : దసరాకి ఓపెనింగ్ అన్నారు.. చరణ్, సుకుమార్ సినిమా ఏమైంది? లండన్‌లో ఉన్నారా?

ఈ దసరాకి RC17 అఫీషియల్‌గా లాంచ్‌ అవుతుందని కళ్లు కాయలు కాసేలా వెయిట్‌ చేసిన మెగా అభిమానుల్ని డిజప్పాయింట్‌ చేశారు మేకర్స్. (RC 17)

  • Published on- October 22, 2026 / 06:47 PM IST

RC 17

RC 17 : రామ్‌చరణ్, సుకుమార్ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది..? RC17 కోసం సుక్కు ఎలాంటి స్టోరీ రెడీ చేశారు..? ఇంతకీ ఈ ప్రస్టేజియస్‌ సినిమాలో రామ్‌ చరణ్‌తో జోడీ కట్టేదెవరు? అన్నింటికి మించి RC17కి దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికి దసరాకి ఆన్సర్‌ వస్తుందనుకుంటే ఊరించి ఉసూరుమనిపించారు.

ఈ దసరాకి RC17 అఫీషియల్‌గా లాంచ్‌ అవుతుందని కళ్లు కాయలు కాసేలా వెయిట్‌ చేసిన మెగా అభిమానుల్ని డిజప్పాయింట్‌ చేశారు మేకర్స్. పూజా కార్యక్రమం కాదు కదా సినిమాకి సంబంధించిన పోస్టర్‌ కూడా రివీల్‌ చేయలేదు. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్‌కి పండుగ పూట నిరాశే ఎదురైంది. అయితే RC17 ప్రాజెక్ట్‌ లాంచ్‌ డిలేకి మెయిన్‌ రీజన్స్‌పై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. సుకుమార్‌తో పాటు రామ్‌ చరణ్‌ కూడా హైదరాబాద్‌లో లేకపోవడమే కారణం అని తెలుస్తోంది.

Also Read : Shweta Basu Prasad : పదేళ్ల తర్వాత తెలుగు మీడియా ముందుకొచ్చిన ‘శ్వేతా బసు ప్రసాద్’.. కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..?

RC17 కోసం లొకేషన్స్‌ ఫైనల్ చేసేందుకు సుకుమార్‌, రామ్‌ చరణ్‌ లండన్‌ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంతోనే ఈ ప్రస్టేజియస్‌ ప్రాజెక్ట్‌ పూజా కార్యక్రమం మైత్రీ మేకర్స్‌ వాయిదా వేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తితో పాటు కంప్లీట్‌ టీమ్‌ని సిద్ధం చేసిన సుక్కు.. లండన్‌ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాతే ముహూర్త కార్యక్రమాలతో RC17 పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RC17 మరింత ఆలస్యం అయ్యే కొద్ది రూమర్స్‌ సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ ప్రస్టేజియస్‌ సినిమాతో పాతికేళ్ల సుకుమార్‌-దేవీశ్రీ ప్రసాద్‌ ఫ్రెండ్షిప్‌కి బ్రేక్‌ పడే చాన్స్‌ ఉందంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్‌ టాలీవుడ్‌లో ఆఫర్స్‌ పట్టేస్తోన్న అనిరుధ్‌ సంగీతం అందిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కి జోడీగా ధురంధర్‌ ఫేమ్‌ సారా అర్జున్‌ నటిస్తుందని టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వాల్సిన మేకర్స్‌ మాత్రం.. ప్రాజెక్ట్‌ లాంచ్‌ని పోస్ట్‌పోన్‌ చేస్తూ మెగా అభిమానుల్ని అప్‌సెట్‌ చేస్తున్నారు.