Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పెద్ది సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. తాజాగా రామ్ చరణ్ ని యాంకర్ ప్రదీప్, కమెడియన్ సత్య కలిశారు. ప్రదీప్ – దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రేపు ఏప్రిల్ 11 న రిలీజ్ కాబోతుంది. మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. రామ్ చరణ్ ని కలవడానికి ప్రదీప్ తో పాటు కమెడియన్ సత్య ఇద్దరూ చరణ్ ఇంటికి వెళ్లారు. అక్కడ సత్య చరణ్ నాకు బాగా క్లోజ్ అని, నేను ఎంత చెప్తే అంత అని కాసేపు కామెడీ చేసారు. చరణ్ కూడా సత్య అసలు ఎవరో తెలియనట్టు ఆటపట్టించారు.
సినిమా టికెట్ కొన్న తర్వాత సత్య రామ్ చరణ్ కాళ్ళు మొక్కడంతో చరణ్ కూడా సరదాగా సత్య కాళ్ళు మొక్కాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సరదాగా చేసినా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ కమెడియన్ సత్య కాళ్ళు మొక్కడంతో అంత పెద్ద హీరో అయి ఉండి కూడా ఇలా చేయడం గ్రేట్ అని ఫ్యాన్స్, నెటిజన్లు చరణ్ ని అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రామ్ చరణ్ – సత్య – ప్రదీప్ చేసిన కామెడీ వీడియో మీరు కూడా చూసేయండి..
Also Read : NTR – Anthony : ఎన్టీఆర్ పొగిడిన యాంథోని ఎవరో తెలుసా?.. అసలు నటుడే కాదు కానీ..