NTR – Anthony : ఎన్టీఆర్ పొగిడిన యాంథోని ఎవరో తెలుసా?.. అసలు నటుడే కాదు కానీ..

ఎన్టీఆర్ కూడా పొగిడాడు ఎవరు ఈ నటుడు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు.

NTR – Anthony : ఎన్టీఆర్ పొగిడిన యాంథోని ఎవరో తెలుసా?.. అసలు నటుడే కాదు కానీ..

Do You Know NTR Praised Mad Actor Athony Details Here

Updated On : April 9, 2025 / 7:31 PM IST

NTR – Anthony : మ్యాడ్, దానికి సీక్వెల్ గా ఇటీవల వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలు మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్స్ గా తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి పెద్ద హిట్స్ కొట్టి భారీ కలెక్షన్స్ సాధించాయి. ఈ రెండు సినిమాల్లోనూ యాంథోని పాత్రలో ఫుల్ గా నవ్వించాడు ఓ నటుడు.

ఇటీవల మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. ఎన్టీఆర్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. యాంథోనీ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టాను. ఫస్ట్ పార్ట్ లో బాగా నవ్వించాడు. మ్యాడ్ స్క్వేర్ లో కూడా యాంథోని ఫుల్ గా నవ్వించాడు. నేను మర్చిపోలేని క్యారెక్టర్ ఈయన. ఒక కామెడీ క్యారెక్టర్ ని మాస్ ఎంట్రీగా బాగా చూపించారు అని పొగిడాడు.

Also Read : Renu Desai – Akira Nandan : అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.. అకిరాని కొంతమంది తిడుతున్నారు..

దీంతో ఎన్టీఆర్ కూడా పొగిడాడు ఎవరు ఈ నటుడు అని అందరూ వెతకడం మొదలుపెట్టారు. యాంథోని అసలు పేరు రవి. సినీ పరిశ్రమలో ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు. ఆర్ట్ డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేసాడు. అలా సిద్ధూ జొన్నలగడ్డకు పరిచయం అయ్యాడు. యాంథోనిలో మంచి రైటింగ్ స్కిల్స్ ఉండటం చూసి సిద్ధూ రైటర్ గా గుర్తించాడు. దాంతో రవి రైటర్ గా టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలకు పని చేసాడు. ఇప్పటి వరకు ఏడు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, రైటర్, యాక్టర్ గా పని చేసాడు.

మ్యాడ్ సినిమా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కి బాగా జుట్టు ఉన్న ఒక క్యారెక్టర్ కావాల్సి రావడంతో అప్పటికే రవి అతను ఫ్రెండ్స్ అవ్వడంతో ఈ యాంథోని క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చారు. మ్యాడ్ సినిమాలో బాగా పేలింది ఈ క్యారెక్టర్. దాంతో మ్యాడ్ స్క్వేర్ లో కూడా కంటిన్యూగా ఉంటుంది ఈ పాత్ర. ప్రస్తుతం రవి విశ్వక్ సేన్ – అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫుల్ లెంగ్త్ నవ్వించబోతున్నాడు. అలాగే ఇంకో సినిమా చేస్తున్నాడు. అలాగే గద్దర్ కి చెందిన ఓ ప్రైవేట్ సాంగ్ లో గద్దర్ లా కనిపించబోతున్నాడు.

Also Read : Renu Desai : సెల్ఫీల కోసం టార్చర్ చేశారు.. దేవుడి దగ్గర కూడా.. ట్రామా చూసాను.. అమ్మాయిలయితే నడుము మీద చెయ్యి వేసి..

అసలు నటనకే సంబంధం లేని వ్యక్తి, నటిద్దాం అని కూడా ఎప్పుడూ అనుకోని వ్యక్తి ఇప్పుడు మంచి బిజీ యాక్టర్ అయ్యాడు మ్యాడ్ సినిమాల వల్ల అని రవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే రవి ఇప్పుడు కథలు కూడా రాస్తున్నాను అని, ఫ్యూచర్ లో దర్శకుడిగా కూడా ఓ సినిమా చేస్తానని తెలిపాడు. ఎన్టీఆర్ కూడా స్టేజిపై పొగడటంతో ఒక్కరోజులో టాలీవుడ్ లో పాపులర్ అయిపోయి మరిన్ని ఛాన్సులు దక్కించుకుంటున్నాడు రవి.