Renu Desai : సెల్ఫీల కోసం టార్చర్ చేశారు.. దేవుడి దగ్గర కూడా.. ట్రామా చూసాను.. అమ్మాయిలయితే నడుము మీద చెయ్యి వేసి..

బయట జనాలు సెలబ్రిటీల సెల్ఫీల కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలిపింది రేణు దేశాయ్.

Renu Desai : సెల్ఫీల కోసం టార్చర్ చేశారు.. దేవుడి దగ్గర కూడా.. ట్రామా చూసాను.. అమ్మాయిలయితే నడుము మీద చెయ్యి వేసి..

Renu Desai Effected with People who Wants Selfies in Kasi and Kumbh Mela

Updated On : April 9, 2025 / 4:02 PM IST

Renu Desai : ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన రేణు దేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. రేణు దేశాయ్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో బయట జనాలు సెలబ్రిటీల సెల్ఫీల కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలిపింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. కాశీకి, కుంభమేళాకు వెళ్ళినప్పుడు VIP లా కాకుండా మాములుగా వెళ్ళాను. కాశీలో తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సెల్ఫీల కోసం టార్చర్ చేసారు. కుంభమేళాలో కూడా అంతే. అడుగు అడుగుకి ఆపేసి ఫోటో, సెల్ఫీ అని అడిగేవాళ్ళు. నేను కాశిలో గంగానది దగ్గర మెడిటేషన్ చేసుకుంటుంటే వచ్చి పిలిచి మీరు రేణు దేశాయ్ కదా అని ఫోటోలు అడిగారు. కనీసం ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకోనివ్వలేదు.

Also Read : Renu Desai : నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఉంది.. ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను..

అమ్మాయిలు అయితే మరీ రూడ్ గా ఉన్నారు. ఫోటో కోసం వచ్చి నడుము మీద చేతులు వేసేస్తారు పట్టుకొని ఫోటో దిగడానికి. చాలా కష్టంగా ఉంటుంది. జనాలు సెలబ్రిటీలను ప్రశాంతంగా ఉండనివ్వరు. అందుకే VIP ప్రోటోకాల్ తో వెళ్లడమే మంచిది. నేను కాశీలో ఏకంగా ట్రామా చూసాను. దేవుడి కోసం వెళ్ళాం అని మర్చిపోతారు. కాశీలో అయితే నేను హోటల్ కి వెళ్తే అక్కడి దాకా నా వెనకాలే ఫాలో అవుతూ వచ్చారు ఫొటోల కోసం అని తను జనాల సెల్ఫీల పిచ్చి వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో తెలిపింది.

Also Read : Renu Desai : నేనే అకిరాని వాళ్ళ నాన్నతో వెళ్ళమని చెప్పాను.. ఆయన మంచి తండ్రి..