Renu Desai : నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఉంది.. ఆ పార్టీలోనే జాయిన్ అవుతాను..
తన పొలిటికల్ ఎంట్రీ గురించి సమాధానమిచ్చింది రేణు దేశాయ్.

Image Credits : Nikhil Vijayendra Simha Youtube Channel
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికి తెలుసు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన రేణు దేశాయ్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అయితే రేణు దేశాయ్ అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతుంది.
తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో గత ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ ఇచ్చారు, అంతకు ముందు పలు పార్టీల గురించి మాట్లాడారు, పాలిటిక్స్ లోకి వస్తారా అని ప్రశ్నించగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి సమాధానమిచ్చింది.
Also Read : Renu Desai : నేనే అకిరాని వాళ్ళ నాన్నతో వెళ్ళమని చెప్పాను.. ఆయన మంచి తండ్రి..
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఆ పార్టీలకు సపోర్ట్ చేశాను. నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని ఉంది. 38 ఏళ్ళ వయసులో పాలిటిక్స్ లోకి రావాలి. కానీ నాకు ఇప్పుడు ఆ ఆలోచన లేదు. ఇప్పుడు అయితే నేను నా పిల్లల కోసమే ఉంటున్నాను. నేను నా డెస్టినీకి వ్యతిరేకంగా వెళ్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది సోషల్ వర్క్ చేయడానికి. నేను ఎప్పుడూ బీజేపీ పర్సన్ నే. నన్ను అంద్ భక్త్ అన్నా, మోడీ భక్త్ అన్నా నేను బీజేపీ పర్సన్ నే. నేను హార్డ్ కోర్ బీజేపీ. పొలిటికల్ పార్టీలోకి వెళ్తే బీజేపీ లోకే వెళ్తాను. నేను పలు పార్టీల్లోకి వెళ్తున్నట్టు గతంలో వార్తలు రాసారు. ఏదైనా పార్టీలోకి వెళ్తే నేనే అధికారికంగా చెప్తాను అని తెలిపారు.
దీంతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మరి బీజేపీలో ఎప్పుడు చేరుతారో, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.