Renu Desai : నేనే అకిరాని వాళ్ళ నాన్నతో వెళ్ళమని చెప్పాను.. ఆయన మంచి తండ్రి..
తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడింది.

Renu Desai Interesting Comments on Akira Nandan and Pawan Kalyan
Renu Desai : నటిగా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, పలు సమస్యల గురించి మాట్లాడుతూ రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర అంశాలు మాట్లాడింది. ఈ క్రమంలో అకిరా నందన్, పవన్ కళ్యాణ్ కలిసి టెంపుల్స్ కి వెళ్లడం గురించి మాట్లాడింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. కాశీకి వెళ్లి వచ్చినప్పటి నుంచి అకిరాకి టెంపుల్స్ మీద ఇష్టం పెరిగింది. నాన్న కుంభమేళాకు వెళ్తున్నారు అని చెప్తే ఆయనతోనే వెళ్ళు నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పాను. కావాలంటే మళ్ళీ నాతో తర్వాత వద్దువు అన్నాను. రీసెంట్ గా తమిళనాడు టెంపుల్స్ కి వెళ్లారు. నాన్న వెళ్తున్నారంట అని నాకు చెప్తే వెంటనే వెళ్లమని నేనే చెప్పాను. ఆయన మంచి తండ్రి. ఆయన దగ్గరికి వెళ్తాను అంటే వెళ్లమనే అంటాను. ఆయనతో పిల్లలు కలవడం ఎందుకు వద్దనుకుంటాను అని తెలిపింది.