Sudheer – Pradeep : చాన్నాళ్ల తర్వాత ప్రదీప్ – సుధీర్ ఒకే ఫ్రేమ్ లో.. ఎంత బాగుందో.. ప్రోమో వైరల్.. ఫుల్ నవ్వించారుగా..
సుధీర్ - ప్రదీప్ కలిసి ఎంటర్టైన్ చేసిన ఫ్యామిలీ స్టార్ ప్రోమో చూసేయండి..

Sudigali Sudheer Anchor Pradeep Entertained in Family Star Show Promo goes Viral
Sudheer – Pradeep : బుల్లితెరపై ప్రేక్షకులని ఫుల్ గా ఎంటర్టైన్ చేసే వారిలో ప్రదీప్, సుధీర్ ముందు ఉంటారు. ఇద్దరూ కష్టపడి పైకి ఎదిగి స్టార్స్ అయినవాళ్లే. సుధీర్ ఇప్పుడు యాంకర్ గా షోలు చేస్తూనే మరో పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రదీప్ టీవీకి కాస్త గ్యాప్ ఇచ్చి సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. ప్రదీప్, దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ పలు టీవీ షోలకు వెళ్ళాడు. ఈ క్రమంలో సుధీర్ యాంకరింగ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ షోకి ప్రదీప్, దీపికా పిల్లి గెస్ట్ లుగా వెళ్లారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో ఆద్యంతం ఇద్దరూ కలిసి ఫుల్ గా నవ్వించారు. సుధీర్, ప్రదీప్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ఒకే షోలో కనిపించడం, ఇద్దరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో వీరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
షోలో ఇద్దరూ కలిసి డ్యాన్సులు వేశారు, కామెడీ చేసారు. సుధీర్, ప్రదీప్ సింగిల్ గానే ప్రేక్షకులని ఫుల్ గా నవ్విస్తారు. అలాంటిది ఇద్దరూ కలిస్తే ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్స్ గ్యారెంటీ కదా. దీంతో ఫ్యామిలీ స్టార్ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ఫుల్ ఎపిసోడ్ ఆదివారం ఏప్రిల్ 13 న రాత్రి 7.30 గంటలకు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది.
సుధీర్ – ప్రదీప్ కలిసి ఎంటర్టైన్ చేసిన ఫ్యామిలీ స్టార్ ప్రోమో చూసేయండి..