Manchu Manoj : మోహన్‌బాబు ఇంటివద్ద మనోజ్‌ బైఠాయింపు.. ‘ఆస్తి గొడవ కాదు.. నేనంటే విష్ణుకి కుళ్లు.. ఇంట్లోకి వెళ్లనివ్వండి’

మోహ‌న్ బాబు ఇంటి ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Manchu Manoj : మోహన్‌బాబు ఇంటివద్ద మనోజ్‌ బైఠాయింపు.. ‘ఆస్తి గొడవ కాదు.. నేనంటే విష్ణుకి కుళ్లు.. ఇంట్లోకి వెళ్లనివ్వండి’

Manchu Manoj Press Meet on issue

Updated On : April 9, 2025 / 3:13 PM IST

Manchu Manoj: మంచు మోహ‌న్ బాబు కుటుంబంలో గ‌త కొంత‌కాలంగా వివాదాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం త‌న కారు పోయింద‌ని మంచు మ‌నోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త‌న సోద‌రుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

ఈ క్ర‌మంలో బుధ‌వారం ఉద‌యం జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్‌బాబు నివాసానికి మ‌నోజ్ చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా గేటు తెర‌వ‌క‌పోవ‌డంతో ఆయ‌న అక్కడే బైఠాయించి నిర‌స‌న తెలియ‌జేశారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మీడియాతో మంచు మ‌నోజ్ మాట్లాడారు. ఆస్తి గొడ‌వ కాదన్నారు. ఇన్ని గొడ‌వ‌లు జ‌రుగుతున్నా అధికారులు స్పందించ‌డం లేద‌న్నారు.’ ఏప్రిల్ 2న పాప పుట్టిన రోజును కుటుంబంతో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చాము. అయితే.. ప‌రిస్థితులు బాగోలేక‌పోవ‌డంతో జైపూర్‌కు వెళ్లాము. నాకు ఈ ఆస్తి వ‌ద్ద‌ని నాన్న‌కు ఎప్పుడో చెప్పాను. ఇది ఆస్తి గొడ‌వ కాదు. విద్యార్థుల భ‌విష్య‌త్తు కోస‌మే ఇదంతా. అక్క‌డే ఈ గొడ‌వ మొద‌లైంది. డిసెంబ‌ర్ నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఛార్జ్ షీట్ ఫైల్ చేయ‌లేదు. క‌త్తులు, గ‌న్‌ల‌తో మమ్మ‌ల్ని కొట్ట‌డానికి వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాదారాల‌ను పోలీసుల‌కు ఇచ్చాను.’ అని మ‌నోజ్ అన్నారు.

‘నా ఇంటిలోకి నన్ను వెళ్ల‌నీయ‌కుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి నన్ను అనుమతి ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించాలి. ఇంట్లో నా కుక్క పిల్లలు ఉన్నాయి. వాటిని ఇవ్వమని అడుగుతున్నా. ఆస్తి కోసం ఏనాడు కొట్లాట చేయ‌లేదు. నా త‌ల్లి మీద ప్ర‌మాణం చేస్తున్నా.. నేనంటే విష్ణుకి కుళ్లు.. కోర్టు ఆర్డ‌ర్ ఉన్నా న‌న్ను ఇంట్లోకి రానివ్వ‌డం లేదు. త‌ప్పుడు సంత‌కాలతో కోర్టును ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు.’అని మ‌నోజ్ తెలిపారు.

⇒ మెల్ల‌మెల్ల‌గా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండ‌గా.. నేనెందుకు..

‘చేతిలోన చెయ్యేసి చెప్పేయ‌వా.. ఇక ఎన్న‌డూ మ్యాచ్ ఓడిపోన‌ని..’ సంజీవ్ గొమెంకా, పంత్ పిక్ వైర‌ల్‌..