Rishabh Pant – Sanjiv Goenka : ‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని..’ సంజీవ్ గొమెంకా, పంత్ పిక్ వైరల్..
లక్నో గెలిచిన తరువాత అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోకి వచ్చాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.078గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Rishabh Pant – MS Dhoni : మెల్లమెల్లగా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండగా.. నేనెందుకు..
ఈ మ్యాచ్‌లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. మిచెల్ మార్ష్ (81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్ పూరన్ (87 నాటౌట్; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఐడెన్ మార్‌క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రసెల్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులకే పరిమితమైంది. అజింక్యా రహానే (61; 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (45; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (30; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (38 నాటౌట్; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినప్పటికి గెలుపుకు నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
పంత్‌ను కౌగలించుకుని..
ఇక ఈ మ్యాచ్‌లో లక్నో గెలిచిన తరువాత అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ రిషబ్ పంత్ ను కౌగలించుకున్నాడు. ఆ తరువాత పంత్ చేతిలో చేయివేసి చాలా సేపు నవ్వుతూ మాట్లాడాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని అంటూ పంత్ దగ్గర సంజీవ్ గొయెంకా మాట తీసుకున్నట్లుగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఫోటోలనే సంజీవ్ గొయెంకా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఈ వారం సూపర్ జెయింట్స్‌కు ఎంతో అద్భుతమైంది. రెండు ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించాము. సమిష్టి కృషి వల్లే ఇదంతా. ఇదే ఊపును మున్ముందు కొనసాగించాలి. ఆల్‌ది బెస్ట్ లక్నో.’ అంటూ రాసుకొచ్చాడు.
What a week for the Super Giants! Two hard-fought wins in two days across two leagues, and in Kolkata, no less. Teamwork continues to be our biggest asset. Let’s keep building on this momentum.#LSGvsKKR #LSG #IPL2025 pic.twitter.com/a924tmqc2h
— Dr. Sanjiv Goenka (@DrSanjivGoenka) April 8, 2025
PBKS vs CSK : చెన్నై పై విజయం.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌కు బీసీసీఐ షాక్..