PBKS vs CSK : ధోని సాక్షిగా.. న్యూజిలాండ్ ఆటగాడికి ఘోర అవమానం..! హాఫ్ సెంచరీ కొట్టినా మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్..
ఐపీఎల్ 18వ సీజన్‌లో మరో ఆటగాడు రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.

pic credit @ mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ జతకలవడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం డెవాన్ కాన్వే (69; 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (36; 23 బంతుల్లో 6ఫోర్లు),శివమ్ దూబె (42; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (27; 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) వేగంగా ఆడినా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ మాక్స్‌వెల్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
మొన్న తిలక్.. నేడు డెవాన్..
లక్నోతో మ్యాచ్‌లో స్లోగా ఆడున్నాడని తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైర్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసిన డెవాన్ కాన్వేను కూడా చెన్నై ఇలాగే రిటైర్డ్ చేసింది. లక్ష్య ఛేదనలో వేగంగా ఆడలేకపోతున్నాడని అతడిని రిటైర్డ్ ఔట్ కమ్మని చెప్పింది. దీంతో చేసేది లేక కాన్వే రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
మరో 13 బంతుల్లో మ్యాచ్ ముగుస్తుందనగా కాన్వే రిటైర్డ్ అయ్యాడు. అతడి స్థానంలో రవీంద్ర జడేజా(5 బంతుల్లో 9 నాటౌట్) వచ్చాడు. అయినప్పటికి చెన్నై ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.
Shane Watson : సీఎస్‌కే వరుస ఓటములు.. ధోని, ఫ్లెమింగ్‌లకు ఓ స్పష్టమైన ప్రణాళిక లేదు..
DEVON CONWAY RETIRED OUT. pic.twitter.com/S4Ep9UE24t
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 8, 2025
దీంతో ఈ సీజన్‌లో రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్న రెండో ఆటగాడిగా కాన్వే నిలిచాడు. ఇక ఈ సీజన్‌లో జట్లు తీసుకుంటున్న రిటైర్డ్ నిర్ణయాలు ఆటగాళ్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ రెండు సందర్భాల్లో ఆయా జట్లు ఓడిపోవడం గమనార్హం.