Rishabh Pant – MS Dhoni : మెల్లమెల్లగా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండగా.. నేనెందుకు..
కేకేఆర్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు రాలేదు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 మెగావేలంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. లక్నో మేనేజ్‌మెంట్ పంత్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ గా కాస్త పర్వాలేదనిపిస్తున్నా కూడా బ్యాటర్‌గా ఘోరంగా విఫలం అవుతున్నాడు. తొలి నాలుగు మ్యాచ్‌లో 19 పరుగులే చేశాడు.
మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరగులు చేసింది. మిచెల్ మార్ష్ (81; 48 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్ పూరన్ (87 నాటౌట్; 36 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు చేయగా ఐడెన్ మార్‌క్రమ్ (47; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా, ఆండ్రీ రసెల్ ఓ వికెట్ పడగొట్టాడు.
PBKS vs CSK : చెన్నై పై విజయం.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌కు బీసీసీఐ షాక్..
అనంతరం అజింక్యా రహానే (61; 35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్ (45; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (30; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్ (38 నాటౌట్; 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టినప్పటికి లక్ష్య చేధనలో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 234 పరుగులకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో ఆకాశ్ దీప్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రతి, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
ధోనిలాగానే పంత్ సైతం..
ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్.. మూడు వికెట్లు పడిన తరువాత కూడా క్రీజులోకి రాలేదు. పంజాబ్, సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన పంత్.. కేకేఆర్ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌కు రాలేదు. నాలుగో స్థానంలో ఫామ్‌లో ఉన్న సమద్‌ని ఐదో స్థానంలో డేవిడ్ మిల్లర్‌ను పంపాడు.
ఫామ్‌లో లేకపోవడంతో తాను క్రీజులోకి వెళ్లి ప్రత్యర్థి జట్టుకి మరో వికెట్ ఇవ్వడం, భారీ స్కోరుకి అడ్డుపడడం మినహా సాధించేది ఏమీ లేదని పంత్ అనుకుని బ్యాటింగ్‌కు రాలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కెప్టెన్సీ సంగతి కాస్త అటుంచితే.. రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలోక్రమక్రమంగా తన గురువు ధోనీలా తయారు అవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
⇒ ‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని..’ సంజీవ్ గొమెంకా, పంత్ పిక్ వైరల్..