CSK Playoffs Scenario : వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెలవాలంటే..?
చెన్నై సూపర్ కింగ్స్ కు ఏదీ కలిసిరావడం లేదు

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఏదీ కలిసిరావడం లేదు. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌ను విజయంతో ఆరంభించింది. అయితే.. ఆ తరువాత ఇప్పటి వరకు మరో నాలుగు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో ఓడిపోయింది.
పాయింట్ల పట్టికలో ఆఖరి నుంచి రెండో స్థానం..
మొత్తంగా ఇప్పటి వరకు చెన్నై 5 మ్యాచ్‌లు ఆడింది. ఓ మ్యాచ్‌లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోవడంతో చెన్నై జట్టు ఖాతాలో రెండు పాయింట్లే ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.889గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో ఈ సీజన్‌లో ఆజట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరుతుందా లేదా అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో మొదలైంది.
PBKS vs CSK : చెన్నై పై విజయం.. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్‌కు బీసీసీఐ షాక్..
సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే..?
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆ ప్రభావం సీఎస్‌కే ప్లే ఆఫ్స్ అవకాశాలపై పడనుందా? ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి? వంటి విషయాలను ఇప్పుడు చూద్దాం..
ఈ సీజన్‌లో చెన్నై మరో 9 మ్యాచ్‌లు ఆడనుంది. గత సీజన్లలో సమీకరణాలు తీసుకుంటే.. ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. 9 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 18 పాయింట్లతో ఈజీగా ప్లే ఆఫ్స్ బెర్తును దక్కించుకున్నాయి. ఈ లెక్కన చెన్నై మిగిలిన 9 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. అప్పుడు చెన్నై ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరతాయి. అప్పుడు ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్ ఉంది. అయితే.. అది మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
అలాకాకుండా మిగిలిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకోవచ్చు. అయితే.. ప్రస్తుతం చెన్నై ఉన్న ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కాస్త కష్టమే. అయితే.. ధోని, రుతురాజ్, జడేజా, అశ్విన్ వంటి దిగ్గజాలు ఉండడంతో ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
చదవండి: ‘చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. ఇక ఎన్నడూ మ్యాచ్ ఓడిపోనని..’ సంజీవ్ గొమెంకా, పంత్ పిక్ వైరల్..
చదవండి: మెల్లమెల్లగా ధోనీలా మారుతున్న పంత్.. వాళ్లుండగా.. నేనెందుకు..