లండన్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సినీ హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఇవాళ లాంఛ్ అయింది. చెర్రీ తన చేతుల మీదుగా లాంచ్ చేసి, అనంతరం దాని పక్కనే తన కుక్కపిల్లతో కూర్చొని పోజులు ఇచ్చాడు. ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలిస్తారు.
ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సినిమా, స్పోర్ట్స్‌తో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంటాయి. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, షారుక్ ఖాన్ మైనపు విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇప్పుడు చెర్రీకి కూడా ఈ అరుదైన గౌరవం దక్కింది. కొన్ని నెలల క్రితమే చెర్రీతో పాటు ఆయన పెంపుడు కుక్క రైమ్‌లకు సంబంధించిన కొలతలను మేడం టుస్సాడ్స్ సిబ్బంది తీసుకున్నారు.
The Global Phenomenon GLOBAL STAR RAM CHARAN @AlwaysRamCharan is soon to be Eternalize with a wax statue at #MadameTussauds in London 🔥🥹🤩
Today’s achievement adds another Feather in the Cap of your Hard work and Dedication My BOSS 👑🦁@madametussauds #RamCharan pic.twitter.com/ypmWzem1eA
— dD (@dD__Here) May 10, 2025