Ram Charan : వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియాలో రామ్ చరణ్ ఉపాసన..

రామ్ చరణ్, ఉపాసన.. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ పై కనిపించి వావ్ అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రామ్ చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ని ఇచ్చారు.

Ram Charan Upasana in worlds top Magazine Forbes cover page

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. RRR చిత్రంతో తన రేంజ్ ని అమాంతం పెంచేసుకున్నారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు చరణ్ పేరు వినిపిస్తూ వస్తుంది. ఈక్రమంలోనే పలు ప్రఖ్యాతి వేదికల పై కనిపిస్తూ.. తన స్టార్‌డమ్ ఏంటో అందరికి తెలియజేస్తున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన.. వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ పై కనిపించి వావ్ అనిపిస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రామ్ చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ని ఇచ్చారు.

ఈ పిక్ లో చరణ్, ఉపాసన పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా, రామ్ చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోడం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ మెగా కపుల్ గురించి కవర్ పేజీ పై ఇలా రాసుకొచ్చారు.. “సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది.

Also read : Salaar : సలార్ కలెక్షన్స్ సునామీ.. ఇండియా వైడ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు..

ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా రామ్ చరణ్ ఉపాసన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇంటికి అతిథులుగా వెళ్లారు. గత కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటుంది చరణ్ దంపతులు.. తమ పాప క్లిన్ కారాతో కలిసి ముంబైలోని ఆలయాలను దర్శించుకుంటూ వస్తున్నారు. ఇక ఈ శుక్రవారం సీఎం ఏక్ నాథ్ షిండే ఫ్యామిలీని కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్, ఉపాసన షేర్ చేశారు.

అయితే వీరిద్దరూ మహారాష్ట్ర సీఎంని ఎందుకు కలిశారు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. తెలుగు హీరో అయిన రామ్ చరణ్ ఎక్కడో మహారాష్ట్ర సీఎం ఇంటికి అతిథిగా వెళ్లడం ఏంటి..? అక్కడ సీఎం ఇంటి ఆడపడుచులతో హిందూ పద్దతిలో ఆతిథ్యం అందుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ తండ్రి మించి కొడుకు అంటూ పోస్టులు వేస్తూ వస్తున్నారు.