Ram Charan Upasana Klin Kaara Enjoying in Australia with animals Photos goes Viral
Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం RC16 సినిమా వర్క్స్ లో ఉన్నారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో కొన్ని పాత ఫొటోలు షేర్ చేసింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం చరణ్, ఉపాసన, క్లిన్ కారా ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి చరణ్ ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఉపాసన తాజాగా షేర్ చేసింది.
Also Read : Devara : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ ఎన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాడో తెలుసా?
ఈ ఫొటోల్లో చరణ్ దంపతులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనపడే కంగారూలు, కోలా జంతువులతో సరదాగా ఆడుకున్నారు. అవి చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. అయితే ఈ ఫొటోల్లో కూడా క్లిన్ కారా ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా చరణ్ ఫ్యామిలీతో కలిసి క్యూట్ గా జంతువులతో ఆడుకుంటుండటంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.