Devara : ‘దేవ‌ర’ కోసం ఎన్టీఆర్ ఎన్ని భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పాడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌.

Devara : ‘దేవ‌ర’ కోసం ఎన్టీఆర్ ఎన్ని భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్పాడో తెలుసా?

Jr NTR About Devara Movie Dubbing

Updated On : September 20, 2024 / 6:05 PM IST

Devara – Jr NTR : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రెండు భాగాలుగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబ‌ర్ 27న‌ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా మూవీ యూనిట్ ఓ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూని విడుద‌ల చేసింది. యువ హీరోలు సిద్ధూ జొన్న‌ల గ‌డ్డ‌, విశ్వ‌క్ సేన్‌లు దేవ‌ర సినిమాకి సంబంధించిన కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఎన్టీఆర్‌, కొర‌టాల శివ‌ను అడిగారు.

Bigg Boss 8 : వెళ్లిపో అంటూ ఏడ్చిన కిరాక్ సీత‌.. సోనియాతో నిఖిల్ గొడ‌వ‌..

దేవ‌ర సినిమా ప‌లు భార‌తీయ బాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో సిద్ధు జొన్న‌ల గ‌డ్డ మాట్లాడుతూ.. హిందీ, త‌మిళ్, క‌న్న‌డ బాష‌ల్లో ఎవ‌రు డ‌బ్బింగ్ చెప్పారు అని అడుగ‌గా.. తానే డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లుగా ఎన్టీఆర్ చెప్పారు. దీంతో మీరు బాంబే షిప్ట్ అయి పోవ‌చ్చు గ‌దా, మేమిక‌క్కడ సినిమాలు చేసుకుంటాం అని సిద్ధూ అడుగ‌గా అమ్మా స‌చ్చిపోతాను. నేను ఇక్క‌డే సినిమాలు చేస్తాను అంటూ ఎన్టీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.