×
Ad

Ram Charan – Upasana : పారిస్‌లో ఎంజాయ్ చేస్తున్న చరణ్, ఉపాసన.. ఎవరికోసం వెళ్లారో తెలుసా?

ఉపాసన, రామ్ చరణ్ కలిసి పారిస్(Paris) కి వెళ్లారు. ఉపాసన స్నేహితురాలు రోస్మిన్ వివాహం ఉండటంతో ఆ వివాహానికి హాజరు కావడానికి వెళ్లారు.

  • Published On : September 13, 2023 / 08:10 AM IST

Ram Charan Upasana went to Paris for Friends Marriage enjoying at Eiffel Tower

Ram Charan – Upasana :  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన (Upasana).. ఇద్దరు కలిసి ఇటీవల ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. క్లీంకార (Klin Kaara) పుట్టిన తరువాత చరణ్-ఉపాసన ఇద్దరు కలిసి బయటకి వెళ్లడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారు..? ఎందుకు వెళ్లారు..? అని అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడంతో అసలు విషయం బయట పడింది.

ఉపాసన, రామ్ చరణ్ కలిసి పారిస్(Paris) కి వెళ్లారు. ఉపాసన స్నేహితురాలు రోస్మిన్ వివాహం ఉండటంతో ఆ వివాహానికి హాజరు కావడానికి వెళ్లారు. రోస్మిన్ ఇంటర్నేషనల్ గా పలు ఈవెంట్స్ లో హోస్ట్ గా చేస్తుంది. అలాగే ఫ్యాషన్, బ్యూటీకి సంబంధించి బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఉపాసనకి ఈమె చాలా క్లోజ్ అంట. అందుకే రోస్మిన్ వివాహానికి పారిస్ వరకు వెళ్లారు ఉపాసన, రామ్ చరణ్.

Siya gautam : నేనింతే హీరోయిన్ శియా గౌతమ్ గుర్తుందా? ఇప్పుడు వెబ్ సిరీస్‌తో రాబోతుంది.. ఎందులోనో తెలుసా?

పెళ్ళిలో తన స్నేహితురాళ్ళతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలు, పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఇక చరణ్ ఎప్పుడు మళ్ళీ తిరిగి గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో చేరుతాడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.