Siya gautam : నేనింతే హీరోయిన్ శియా గౌతమ్ గుర్తుందా? ఇప్పుడు వెబ్ సిరీస్‌తో రాబోతుంది.. ఎందులోనో తెలుసా?

Neninthe Movie Fame Siya Gautham coming with Athidhi web series in Disney Plus Hotstar
Siya gautam : ముంబైకి(Mumbai) చెందిన మోడల్ సియా గౌతమ్ 2008లో రవితేజ(Raviteja) హీరో గా నటించిన నేనింతే(Neninthe) సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది, అవార్డులు కూడా తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత శియా గౌతమ్ కి ఎక్కువగా అవకాశాలు రాలేదు.
అనంతరం వేదం సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది. కన్నడలో డబల్ డెక్కర్ అనే సినిమా, హిందీలో సంజు సినిమాల్లో కనిపించిన శియా ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత తన పేరుని అదితి గౌతమ్(Aditi Gautham) గా మార్చుకుంది. ఇటీవల గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది శియా గౌతమ్. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ.
తాజాగా శియా గౌతమ్ ఇప్పుడు తెలుగులో అతిధి అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది. ఒకప్పుడు కామెడీ సినిమాలతో మెప్పించిన వేణు తొట్టెంపూడి ఇటీవల రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అతిధి వెబ్ సిరీస్ లో సీరియస్ రోల్ లో కనిపించబోతున్నారు. వేణు సరసన అతిధి(Athidhi) అనే హారర్ థ్రిల్లర్ సిరీస్ లో శియా గౌతమ్ కనిపించబోతుంది. ఇప్పటికే అతిథి ట్రైలర్ రిలీజ్ అయి అందర్నీ భయపెట్టింది. అతిధి వెబ్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ లో తెలుగులో కనపడబోతున్న శియా గౌతమ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.