Ram Charan : అయ్యప్ప మాలలో రామ్ చరణ్.. ఇక గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ దీక్షలోనే..

రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప మాలలో కనిపించారు.

Ram Charan Wears Ayyppa Deeksha Participating in Game Changer Movie Promotions

Ram Charan : రామ్ చరణ్ త్వరలో సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం RC16 సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. నేడు గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చరణ్ కూడా హాజరు కాబోతున్నాడు. లక్నో వెళ్లేందుకు రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ వెళ్లగా అక్కడి నుంచి చరణ్ విజువల్స్ వైరల్ గా మారాయి.

Also Read : Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్‌డేట్‌.. కౌంట్ డౌన్ స్టార్‌..

రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప మాలలో కనిపించారు. ఇటీవల ఓ ప్రైవేట్ పార్టీకి మాల్దీవ్స్ వెళ్లొచ్చిన చరణ్ రాగానే అయ్యప్ప మాల వేసుకున్నట్టు తెలుస్తుంది. మాల వేసుకొని కూడా ఒకటి లేదా రెండు రోజులు అయి ఉంటుందని సమాచారం. దీంతో ఇకపై గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలోనే కనిపించనున్నాడు. రామ్ చరణ్, చిరంజీవిలతో పాటు చాలా మంది టాలీవుడ్ స్టార్స్ రెగ్యులర్ గా కుదిరిన ప్రతి సారి అయ్యప్ప మాల వేస్తారని తెలిసిందే.

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, తమిళ్ లో కూడా చాలా మంది స్టార్స్ కుదిరిన ప్రతి సారి అయ్యప్ప మాల వేసుకుంటారు. ప్రస్తుతం చరణ్ ఇలా మాలలో కనిపించడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.