Upasana : రామ్ చరణ్ భార్యగా, అపోలో హాస్పిటల్ బాధ్యతలతో అందరికి పరిచయమే. ఉపాసన కూడా తన బిజినెస్ లతో, ఫ్యామిలీతో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఉపాసన ఈ ఇంటర్వ్యూలో తన బిజినెస్, హెల్త్, ఫ్యామిలీ, వుమెన్ ఎంపవర్మెంట్.. ఇలా అనేక అంశాలు మాట్లాడింది. ఈ క్రమంలో క్లిన్ కారా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఉపాసన మాట్లాడుతూ.. నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఎక్కువగా పెరిగాను. నా కూతురు కూడా అలాగే పెరగాలి. తను గ్రాండ్ పేరెంట్స్ తో ఎక్కువ సమయం గడపాలి అనుకుంటాను. గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే అదొక అందమైన అనుభవం. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కల్చర్ తగ్గిపోయింది. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టం. నాకు అందరితో కలిసి ఉండాలి. మా అత్త మామ జాగ్రత్తగా చూసుకుంటారు. నేను వాళ్ళతో ఉండాలి అనుకుంటాను. నా కూతురు మంచి చేతుల్లో ఉంది. మా ఫ్యామిలీ, మా మామయ్య ఫ్యామిలీ అంతా క్లిన్ కారాని జాగ్రత్తగా పెంచుతున్నారు అని తెలిపింది. దీంతో ఉపాసన వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ కల్చర్, గ్రాండ్ పేరెంట్స్ గురించి గొప్పగా చెప్పడంతో ఆమెని అభినందిస్తున్నారు.