Pawan Kalyan : పెద్ద కొడుకు అకిరా పుట్టిన రోజు.. చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ప్రమాదం.. గిరిజన గ్రామాల్లో పవన్.. పాపం అంటున్న ఫ్యాన్స్..
పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు.

Pawan kalyan Son Akira Nandan Birth Day another Son Injured in Singapore
Pawan Kalyan : ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ భార్య అన్న లెజనోవా, ఆమె పిల్లలతో కలిసి సింగపూర్ లో నివసిస్తుంది. పవన్ పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. అయితే నేడు ఉదయం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్న స్కూల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
అయితే పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. పర్యటన ఆపేసి సింగపూర్ వెళ్ళమని చెప్పినా.. అరకు సమీపంలోని కురిడి గ్రామంకు వస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని తెలిపారు. దీంతో పవన్ ప్రస్తుతం గిరిజన గ్రామాల్లోనే ఉన్నారు. నేడు సాయంత్రం వరకు వైజాగ్ వచ్చి అక్కడ్నుంచి సింగపూర్ వెళ్లనున్నారు.
మరో వైపు నేడు పవన్ పెద్ద కొడుకు అకిరా నందన్ పుట్టిన రోజు. ఓ పక్క పెద్ద కొడుకు పుట్టిన రోజు నాడు కూడా కొడుకుతో పవన్ గడపలేకపోతున్నాడని, మరోవైపు చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో చిక్కుకొని బయటపడి హాస్పిటల్ పాలైతే వెంటనే వెళ్లలేకపోయాడని పాపం అంటున్నారు ఫ్యాన్స్. ప్రజల కోసం, వాళ్లకు ఇచ్చిన మాట కోసం ఫ్యామిలీని దూరం పెట్టి మరీ పని చేస్తున్నాడని పవన్ ని ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అభినందిస్తున్నారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.