NTR – Sukumar : డైరెక్టర్ భార్య పుట్టిన రోజు వేడుకలు.. ఫ్యామిలీతో ఎన్టీఆర్, సుకుమార్.. మహేష్ బాబు మిస్సింగ్.. ఫోటో వైరల్..
తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది.

NTR Sukumar Prasanth Neel Attends to Director Vamshi Paidipally Wife Birthday Celebrations
NTR – Sukumar : మన సెలబ్రిటీలు ఒకరింట్లో వేడుకలకు ఒకరు హాజరవుతూనే ఉంటారు. కానీ ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు బయటకు వస్తాయి. తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
ఈ క్రమంలో ఎన్టీఆర్, ఎన్టీఆర్ భార్య ప్రణతి, సుకుమార్, సుకుమార్ భార్య తబిత కూడా మాలిని పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్, ప్రణతి, సుకుమార్, తబిత, ప్రశాంత్ నీల్, వంశీ పైడిపల్లి, మాలిని, వంశీ పైడిపల్లి కూతురు.. వీరంతా కలిసి దిగిన గ్రూప్ ఫోటోని తబిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read : Payal Rajput : మా నాన్నకు క్యాన్సర్.. ఇవాళే ట్రీట్మెంట్ మొదలుపెట్టాం.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ పోస్ట్..
ఈ గ్రూప్ ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తబిత సుకుమార్.. మాలినికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఎన్టీఆర్ – సుకుమార్ – ప్రశాంత్ నీల్ -వంశీ పైడిపల్లి.. ఇలా స్టార్స్ అంతా ఒకే ఫొటోలో ఉండటంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలో మహేష్ బాబు మిస్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు – వంశీ పైడిపల్లి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. ఈ ఇద్దరి ఇళ్లల్లో ఏ వేడుక అయినా ఇద్దరూ కలిసి కనిపిస్తారు. అయితే మహేష్ ప్రస్తుతం ఇటలీ వెకేషన్ కి ఫ్యామిలీతో వెళ్లడంతో వంశీ పైడిపల్లి భార్య పుట్టిన రోజు వేడుకలకు రాలేకపోయాడు. ఒకవేళ మహేష్ కూడా ఉంటే ఎన్టీఆర్ – మహేష్ ని ఒకే ఫ్రేమ్ లో చూసేవాళ్ళం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
నిన్న ఎన్టీఆర్, సుకుమార్ కలిసి కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో లుడా ఈ వేడుకలలోదే అని తెలుస్తుంది.