Payal Rajput : మా నాన్నకు క్యాన్సర్.. ఇవాళే ట్రీట్మెంట్ మొదలుపెట్టాం.. పాయల్ రాజ్‌పుత్ ఎమోషనల్ పోస్ట్..
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

Payal Rajput Emotional Post on her Father effected with Cancer
Payal Rajput : RX100 తో టాలీవుడ్ లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత పలు సినిమాలు నిరాశపరిచిన మంగళవారం సినిమాలో తన నటనతో అందర్నీ మెప్పించి పెద్ద హిట్ కొట్టింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే పాయల్ రాజ్‌పుత్ తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
పాయల్ రాజ్‌పుత్ తన సోషల్ మీడియాలో.. మా నాన్నకు ఇటీవల క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. కిమ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించాలని డిసైడ్ అయ్యాం. ఇవాళ ఆయనకు ఫస్ట్ కీమో థెరపీ సెషన్. నాకు కొంచెం భయంగా ఉంది. కానీ తప్పదు. మా నాన్న చాలా ధైర్యంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా మా నాన్న నన్ను పని చేసుకో, షూటింగ్స్ కి, ఈవెంట్స్ కి వెళ్ళు అని చెప్పారు. మీతో ఈ విషయం చెప్పాలనిపించింది. ఇలాంటి సమయంలో మీ ప్రేమానురాగాలు మాకు సపోర్ట్ ఇస్తాయి. ఆయన త్వరగా కోలుకుంటాడని మేము కోరుకుంటున్నాము అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
వాళ్ళ నాన్న చెయ్యి పట్టుకున్న ఫోటోని పాయల్ రాజ్‌పుత్ ఈ పోస్ట్ లో షేర్ చేసింది. దీంతో పలువురు ఫ్యాన్స్, సెలబ్రిటీలు, నెటిజన్లు పాయల్ తండ్రి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.