Ram Charan's new schedule for Peddi movie begins in Pune
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు సనా(Peddi) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో, ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. గేమ్ ఛేంజర్ ప్లాప్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కలర్ ఎగరేసేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు.
Shivraj Kumar: విజయ్ ఏదైనా చేసేముందే ఆలోచించాలి.. కరూర్ ఘటనపై శివరాజ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
మరోసారి రంగస్థలం రేంజ్ లో ఇండియన్ సినీ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా పెద్దిని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ కి ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ లుక్ కి ఆయన చెప్పిన డైలాగ్స్ కి మెగా ఫ్యన్స్ ఫిదా అయిపోయారు. దాంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ ఫిక్స్ ఐపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నారు టీం. ఓపక్క షూట్ మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకాచకా కానిస్తూ భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, పెద్ది సినిమా న్యూ షెడ్యూల్ పూణేలో మొదలుకానుంది. ఈ షెడ్యూల్ రామ్ చరణ్, జాన్వీ మధ్య ఒక మాస్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారట. ఈ పాటను జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. రహమాన్ అందించిన సాంగ్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో జానీ మాస్టర్ కూడా అదే రేంజ్ లో స్టెప్స్ కంపోజ్ చేశాడట. విడుదల తరువాత ఈ సాంగ్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని టీం భావిస్తున్నారట. ఇక పెద్ది సినిమా విషయంలో ఎలాంటి వియిదాలు లేకుండా మర్చి 27న పక్కాగా విడుదల చేయాలనీ టీం కష్టపడుతున్నారట. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న పెద్ది సినిమాకు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.