Peddi: పెద్ది సినిమా సాంగ్ షూటింగ్.. ఈ ఒక్క వీడియో చాలు.. రామ్ చరణ్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పడానికి..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా(Peddi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Peddi: పెద్ది సినిమా సాంగ్ షూటింగ్.. ఈ ఒక్క వీడియో చాలు.. రామ్ చరణ్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పడానికి..

Ram Charan's Peddi movie song shooting video leaked

Updated On : October 18, 2025 / 6:43 AM IST

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రూరల్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా (Peddi)ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే కనుకగా 2026 మర్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానంది.

Yellamma: ఇంకా లేట్ చేస్తే మొదటికే మోసం.. వేణుకు అర్థం అవుతుందా.. లేదా..?

అయితే, రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ లో ఉన్నారు. కాబట్టి, వాళ్ళని ఎలాగైనా హ్యాపీ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. అందుకోసం చాలా కష్టపడుతున్నాడు. చాలా రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడు. దీనికి సంబందించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎత్తైన లోయ చివర్లో నిల్చొని చెట్టుపై కాలు పెట్టి డాన్స్ చేస్తూ కనిపించాడు చరణ్. వీడియోలో చుసిన ఆ లోయ చాలా లోతుగా ఉంది. కొంచం స్లిప్ అయినా ప్రమాదమే. ఆ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్, నెటిజన్స్ సైతం అవాక్కయ్యారు. ఒక పాట కోసం అంత రిస్క్ అవసరమా చరణ్ అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఇదే సాంగ్ కి సంబంధించి మరో వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో కూడా ఒక లోయ నుంచి పైకి ఎక్కుతూ కనిపించాడు రామ్ చరణ్. ఇక దర్శకుడు బుచ్చిబాబు తాను ఎక్కడానికి ఇద్దరి సహాయం తీసుకుంటే.. చరణ్ మాత్రం ఒక్కడే పైకి ఎక్కుతూ కనిపించాడు. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ ఎంతలా కష్టపడుతున్నాడు అని. ఈ రెండు వీడియోలు చూశాక ఆడియన్స్ ఫిక్స్ ఐపోతున్నారు. కచ్చితంగా పెద్ది సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని. గతంలో ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ కూడా పెద్ది సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన పెద్ది సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. కానీ, పెద్ది గురించి చెప్తున్న. సినిమా సూపర్ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ చెప్పిన ఈ మాట మెగా ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక లవ్ సాంగ్ విడుదల కాబోతుంది అని దర్శకుడు బుచ్చిబాబు చెప్పాడు. దానికి సంబందించిన అప్డేట్ కూడా త్వరలోనే రానుంది.