కమ్మరాజ్యంలో కడపరెడ్లు : బాలకృష్ణ పాత్ర గురించి వర్మ క్లారిటీ
‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్.. బాలకృష్ణ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ..

‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్.. బాలకృష్ణ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన ‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ..
‘కాంట్రవర్సీ కింగ్’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ : నేనెవరిని టార్గెట్ చెయ్యలేదు ఉన్నవే చూపిస్తున్నాను.. కేఏ పాల్‌ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. ప్రస్తుతం ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపే పనిలో ఉన్నారు. ఇలాంటివి ఆయన పట్టించుకోరు అనుకుంటున్నాను. నా సినిమాలో ఈ కులం కన్నా ఆ కులం, ఆ కులం కన్నా ఈ కులం పెద్దది అని నేను చెప్పడం లేదు. బుధవారం నా సినిమా సెన్సార్ అవుతుంది. కొందరు అనుకుంటున్నట్టు, మీడియా వారు అడుగుతున్నట్టు నాకు ఎవరి దగ్గర్నుంచి బెదిరింపులు రాలేదు.
అసెంబ్లీలో మనుషులు అనుకున్నవి ప్రజలు చూస్తున్నప్పుడు సినిమాలో చూపిస్తే, యాక్టర్స్ చేస్తే తప్పేముంది. ఇంతకుముందు జరిగిన పరిణామలను సినిమాటిక్‌గా చెప్పాను కానీ ఈ సినిమాలో జరగనిది చూపిస్తున్నాము.. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ పాత్ర లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. అన్ని కార్యక్రమాలు ముగించుకుని నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’..