RGV : చిరంజీవికి ఆర్జీవీ మెగా కౌంటర్.. వాళ్ళని దూరం పెట్టకపోతే అంతే..

కొంతమంది కమెడియన్లు, ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి అభిమానులు, జబర్దస్త్ షో బ్యాచ్ అంతా చిరంజీవి చుట్టూ చేరి భజన చేస్తూ ఆయన ఏం చేసినా సూపర్ అని పొగుడుతూ ఉన్నారని ఇటీవల టాక్ నడుస్తుంది.

Ram Gopal Varma counters in Twitter to Chiranjeevi regarding Bholaa Shankar Movie

Ram Gopal Varma : ఆర్జీవీ(RGV) అందరిపైనా కౌంటర్లు వేస్తూనే ఉంటాడని తెలిసిందే. తన ట్వీట్స్ తో ఎప్పుడూ వైరల్ అయినా అప్పుడప్పుడు నిజాలు కూడా మాట్లాడతాడు. తాజాగా చిరంజీవిపై ఆర్జీవీ ట్విట్టర్ లో వేసిన కౌంటర్ వైరల్ గా మారింది. తాజాగా నేడు చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజయి బాగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.

చిరంజీవి(Chiranjeevi) స్థాయి, ఏజ్ ఉన్న రజినీకాంత్(Rajinikanth), కమల్(Kamal Haasan) లాంటి వాళ్ళు విక్రమ్(Vikram), జైలర్(Jailer) లాంటి వాళ్ళ ఏజ్ కి తగ్గ సినిమాలు చేస్తుంటే చిరంజీవి మాత్రం ఇంకా హీరోయిన్స్ తో డ్యాన్సులు వేస్తూ, వింటేజ్ అంటూ ఏజ్ ని కవర్ చేస్తూ కామెడీ చేయడానికి చూస్తూ విమర్శల పాలవుతున్నారు. అయితే కొంతమంది కమెడియన్లు, ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి అభిమానులు, జబర్దస్త్ షో బ్యాచ్ అంతా చిరంజీవి చుట్టూ చేరి భజన చేస్తూ ఆయన ఏం చేసినా సూపర్ అని పొగుడుతూ ఉన్నారని ఇటీవల టాక్ నడుస్తుంది.

ఇక భోళా శంకర్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. సినిమా ప్రమోషన్స్ లో హైపర్ ఆది, గెటప్ శ్రీను, పలువురు జబర్దస్త్ కమెడియన్లు మెగాస్టార్ ని ఆకాశానికెత్తేశారు. ఆయన గురించి పొగుడుతూ భజన చేశారు. ఆయన స్థాయి ఓ రేంజ్ అని అందరికి తెలిసిందే అయినా వీళ్ళు భజన చేసినట్టే అనిపించింది. ఇక సినిమాలో వీళ్ళందర్నీ పెట్టుకొని చేసిన కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడం, ఈ జబర్దస్త్ కామెడీ వర్కౌట్ అవ్వకపోవడంతో విమర్శలు బాగా వస్తున్నాయి. మెగాస్టార్ రేంజ్ ఇది కాదు, ఆయన తీయాల్సింది ఇలాంటి సినిమాలు కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas Spirit : ప్రభాస్ స్పిరిట్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఇతనే.. యానిమల్ తర్వాత సందీప్ వంగ టార్గెట్ ‘స్పిరిట్’

ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆర్జీవీ చిరంజీవిపై ఇండైరెక్ట్ గా.. జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అని ట్వీట్ చేశారు. ఇండైరెక్ట్ గా హైపర్ ఆది, జబర్దస్త్ బ్యాచ్ ని దూరం పెట్టండి అని చెప్పాడు. దీంతో ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇక అభిమానులు, పలువురు నెటిజన్లు కూడా అవును నిజమే అని కామెంట్స్ చేస్తున్నారు.