Ranbir Kapoor Animal : సందీప్ వంగా ‘యానిమల్’ కథకి RGV సలహాలు..

సందీప్ రెడ్డి వంగా రణ్‌బీర్ కపూర్ తో (Ranbir Kapoor) 'యానిమల్' (Animal) అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో రామ్ గోపాల వర్మ హెల్ప్ చేసినట్లు తెలియజేశాడు.

Ram Gopal Varma helped in Ranbir Kapoor Animal script

Ranbir Kapoor Animal : విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) అర్జున్ రెడ్డి (Arjun Reddy) అనే ట్రెండ్ సెట్టర్ సినిమా తీసి ఇండియన్ ఇండస్ట్రీలోనే సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ అయ్యిపోయాడు. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోలు సందీప్ తో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తో (Ranbir Kapoor) సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో ‘యానిమల్’ (Animal) అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Ranbir Kapoor : పాకిస్థానీ సినిమాల్లో నటిస్తా.. వివాదం అయిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రణబీర్..

తాజాగా ఈ సినిమా గురించి రామ్ గోపాల వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కథ విషయంలో సందీప్, వర్మని సంప్రదించాడట. RGV కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు యానిమల్ సినిమా గ్యాంగ్ స్టార్ సినిమాలు అన్నిటికి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది అంటూ కామెంట్స్ చేశాడు. వర్మ కూడా మొదటి సినిమా ‘శివ’ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు ట్రెండ్ సెట్టర్స్ కలిసి యానిమల్ కథ చర్చిండడంతో ఈ చిత్రం పై మరింత హైప్ పెరిగింది.

Ranbir Kapoor : అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్‌ల నటన పై రణ్‌బీర్ వైరల్ కామెంట్స్..

దీంతో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీని ఆగష్టు 11న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్, ప్రణీతి చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.