RGV : విజయవాడలో ఆర్జీవీ.. రేపే భారీగా ‘వ్యూహం’ జగగర్జన ఈవెంట్..

దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఆర్జీవీ వ్యూహం సినిమాకు జగగర్జన అనే పేరుతో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు.

Ram Gopal Varma in Vijayawada RGV Busy with Vyooham Jagaggarjana Event

RGV : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ జగన్ జీవిత కథ ఆధారంగా వ్యూహం (Vyooham), శపథం సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ మరణించే ముందు, మరణించిన తర్వాత జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన పరిణామాలపై ‘వ్యూహం’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు ఆర్జీవీ.

దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జగగర్జన అనే పేరుతో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో రేపు డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటల నుండి భారీగా ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా జనాలు, జగన్ అభిమానులు వస్తారని అంచనా.

Also Read : సలార్‌లో కనిపించిన ఖాన్సార్ సిటీ ఎక్కడుందో తెలుసా?

దీంతో ఆర్జీవీ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నేడు విజయవాడకు వెళ్లి అక్కడ స్టేడియంలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులని పర్యవేక్షించారు. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. ఆర్జీవీ మాట్లాడుతూ.. వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు, ఎమ్మేల్యేలు వస్తారు. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదు. వేరే వాళ్ళ మీద వ్యూహం తీసాం కానీ మా మీద మాకు వ్యూహం లేదు. చంద్రబాబు అరెస్ట్, వివేకా హత్య వంటి సన్నివేశాలు ఉంటాయి.

వ్యూహంలో చంద్రబాబు, పవన్, చిరంజీవి , షర్మిల, సోనియా, రాహుల్.. ఇలా అందరి పాత్రలు ఉంటాయి. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్ కు సంబందించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తాం. జనవరి నెలలో వ్యూహం కి కొనసాగింపు గా ‘శపథం’ రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాలకు ఎన్నికల కోడ్ అడ్డు రాదు. జగన్ ఆలోచనా విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నాను. శపథంలో జగన్ సీఎం ఆయ్యక ఆయన ఫెయిల్యూర్స్, సక్సెస్ లు చూపిస్తాం అని తెలిపారు. దీంతో ఈ జగగర్జన ఈవెంట్ అటు రాజకీయపరంగా కూడా ఏపీలో చర్చగా మారింది.