Salaar : సలార్‌లో కనిపించిన ఖాన్సార్ సిటీ ఎక్కడుందో తెలుసా?

ప్రభాస్ సలార్ పార్ట్ 1 పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ సిటీపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ఈ సిటీ నిజంగా ఉందా?

Salaar : సలార్‌లో కనిపించిన ఖాన్సార్ సిటీ ఎక్కడుందో తెలుసా?

Khansar city

Khansar City: ప్రభాస్ సలార్ పార్ట్ 1  థియేటర్లలో దుమ్ము రేపుతోంది. పాజిటివ్ టాక్‌తో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్ట్ 1 చూసినవారిలో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందనే ఆసక్తి మొదలైపోయింది. ఈ సినిమా విడుదల తర్వాత ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కథ అంతా ఖాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా? సినిమా కోసం క్రియేట్ చేసారా?

Also Read: సలార్ పార్ట్ 2 టైటిల్ ఏంటో తెలుసా? పార్ట్ 2 స్టోరీ ఇదే..

ప్రభాస్-ప్రశాంత్ నీల్.. ఇద్దరూ ఇద్దరే. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులపై మామూలు ప్రభావం చూపించలేదు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే వేరే లెవెల్‌ లో ఊహించారు అభిమానులు. వారి అంచనాలకు తగ్గట్లే ప్రశాంత్ నీల్ సలార్‌ను ప్రేక్షకుల ముందుంచారు. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమాలో కథ మొత్తం ఖాన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఈ నగరం పాకిస్తాన్-గుజరాత్ మధ్య ఉందని సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చూపించిన ఆ నగరం నిజంగా ఉందా? సినిమా కోసం క్రియేట్ చేసారా? అనే అనుమానాలు వచ్చాయి. నిజానికి ఖాన్సార్ అనే నగరం ఉంది. కానీ సినిమాలో చూపించినట్లుగా కాకుండా ఇరాన్‌లో ఖాన్సార్ కౌంటీ.

Also Read : సలార్ ఏ టీవీ ఛానల్.. ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందో తెలుసా..?

ఖాన్సార్ ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లో ఉంది. ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్లు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో చూపించిన ఖాన్సార్‌కి.. ఇరాన్‌లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు. సలార్ సినిమా విడుదల తర్వాత ఈ ఖాన్సార్ సిటీ తెరపైకి వచ్చింది. నిజంగానే ఈ సిటీ ఉందా అని అభిమానులు గూగుల్‌లో తెగ వెతుకుతున్నారు.