Salaar Part 2 : సలార్ పార్ట్ 2 టైటిల్ ఏంటో తెలుసా? పార్ట్ 2 స్టోరీ ఇదే..
క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక్క ట్విస్ట్ తో సినిమాని ఒక్కసారిగా పైకి లేపారు. దీంతో పార్ట్ 2పై మరింత హైప్ వచ్చి ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది.

Prabhas Salaar Movie Part 2 Title and Story Details
Salaar Part 2 : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు డిసెంబర్ 22న గ్రాండ్ గా పాన్ ఇండియా సినిమాగా రిలీజయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సలార్ పార్ట్ 1 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అయితే సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నా క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక్క ట్విస్ట్ తో సినిమాని ఒక్కసారిగా పైకి లేపారు. దీంతో పార్ట్ 2పై మరింత హైప్ వచ్చి ఆ సినిమా కోసం ఎదురు చూసేలా చేశారు.
సలార్ పార్ట్ 1లో ఖాన్సార్ ప్రపంచం, అందులో ఉన్న వారంతా అక్కడి అధికారం కోసం కొట్టుకున్నట్టు, పృథ్విరాజ్ కూడా అధికారం కోసం ప్రభాస్ సాయం కోరినట్టు, ప్రభాస్ తన స్నేహితుడి కోసం ఏం చేసాడు అని చూపించారు. అయితే కొన్ని సీన్స్ పూర్తి కాకుండానే పార్ట్ 1 ముగించి పార్ట్ 2 ప్రకటించారు. ఇక పార్ట్ 1 సీజ్ ఫైర్ కాగా పార్ట్ 2 కి ‘శౌర్యంగ పర్వం’ అని సినిమా క్లైమాక్స్ లో వేశారు.
Also Read : Salaar : సలార్ ఏ టీవీ ఛానల్.. ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందో తెలుసా..?
ఇక పార్ట్ 2లో అసలు ప్రభాస్ ఎవరు? ప్రభాస్ – పృధ్విరాజ్ పాత్రల మధ్య శత్రుత్వం ఎలా వచ్చింది? ఖాన్సార్ రాజు ఎవరు అవుతారు? శృతి హాసన్ ని ప్రభాస్ ఎందుకు కాపాడుతున్నాడు? ప్రభాస్ తల్లి అతన్ని ఎందుకు కట్టడి చేస్తుంది? శౌర్యంగ పర్వం అంటే ఏంటి? అనేది పార్ట్ 2లో చూపించనున్నారు. అసలు కథ అప్పుడే చూపించనున్నారు. పార్ట్ 1 కేవలం అసలైన కథకు ఒక ఇంట్రో లాంటిది మాత్రమే. దీంతో ఇప్పట్నుంచే సలార్ పార్ట్ 2పై అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. ఇక పార్ట్ 2 సినిమా ఓ రెండేళ్ల తర్వాత వస్తుందని సమాచారం.
#Salaar Part 1: Ceasefire#Salaar Part 2 Shauryanga Parvam
— Aakashavaani (@TheAakashavaani) December 21, 2023