Salaar : సలార్ ఏ టీవీ ఛానల్.. ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందో తెలుసా..?

థియేటర్స్ లోకి వచ్చేసిన సలార్.. బుల్లితెర పై ఏ ఛానల్ లో ప్రసారం కాబోతుందో..? ఓటీటీలో ఏ ప్లాట్‌ఫార్మ్ లో స్ట్రీమ్ కానుందో తెలుసా..?

Salaar : సలార్ ఏ టీవీ ఛానల్.. ఏ ఓటీటీలో ఎప్పుడు రాబోతుందో తెలుసా..?

Prabhas Salaar Part 1 Ceasefire digital and satellite streaming details

Salaar : రెబల్ అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణం నేడు కళ్ళ ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి భాగం.. నేడు పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ థియేటర్స్ వద్ద సినిమా సందడి మొదలైపోయింది. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ రావడంతో రెబల్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. మరి ఈ చిత్రం బుల్లితెర పై ఏ ఛానల్ లో ప్రసారం కాబోతుందో..? ఓటీటీలో ఏ ప్లాట్‌ఫార్మ్ లో స్ట్రీమ్ కానుందో తెలుసా..?

బుల్లితెరలో స్టార్ మా ఛానల్ సలార్ రైట్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ ధరకి సలార్ ని సొంతం చేసుకున్నారు. దాదాపు రూ.22 కోట్లకు సలార్ టీవీ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్నారట. కాగా గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా టీవీ రైట్స్‌ అన్ని భాషల్లో కలిపి 25 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అంటే సలార్ చిత్రం ఆర్ఆర్ఆర్ రికార్డుని బ్రేక్ చేసిందనే చెప్పాలి.

Also read : Salaar Part 1 Review : సలార్ మూవీ రివ్యూ.. సినిమాలో ఎలివేషన్స్ కాదు.. ఎలివేషన్స్‌తోనే సినిమా..

ఇక ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుందంటే.. వరల్డ్స్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకుందట. ఈ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు 300 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీలోకి ఎనిమిది వారలు (రెండు నెలలు) తరువాతే స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ మొత్తం బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ చిత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 325 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ విషయంలో కూడా సలారే టాప్ లో ఉందట.