Salaar Part 1 Review : సలార్ మూవీ రివ్యూ.. సినిమాలో ఎలివేషన్స్ కాదు.. ఎలివేషన్స్‌తోనే సినిమా..

ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Salaar Part 1 Review : సలార్ మూవీ రివ్యూ.. సినిమాలో ఎలివేషన్స్ కాదు.. ఎలివేషన్స్‌తోనే సినిమా..

Prashanth Neel Prabhas Salaar Part 1 Cease Fire Movie Review and Rating

Salaar Movie Review : ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పృథ్విరాజ్ కుమార్, శృతిహాసన్, జగపతి బాబు, బాబీ సింహ, టిన్ను ఆనంద్, మైమ్ గోపి, ఈశ్వరరావు, శ్రియ రెడ్డి, ఝాన్సీ.. ఇలా అనేకమంది స్టార్ యాక్టర్స్ సినిమాలో ఉన్నారు. హోంబలె సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. గత మూడేళ్ళుగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్స్ లో ప్రభాస్ అభిమానులు సందడి చేస్తున్నారు.

కథ విషయానికొస్తే..
కొన్ని ఏళ్ళ క్రితం చిన్నప్పుడు దేవా(ప్రభాస్), వరదరాజ మన్నార్(పృథ్విరాజ్ సుకుమారన్) చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వరద కోసం దేవా ఏమైనా చేస్తాడు. దీంతో దేవాకి ఓ కష్టం వచ్చినప్పుడు ఖాన్సార్ రాజు కొడుకు వరద తన రాజ్యంలోని ఓ భాగాన్ని వదిలేసి మరీ కాపాడతాడు. దీంతో దేవా అతని కోసం ఏమైనా చేస్తా అని మాట ఇస్తాడు. కథ ప్రస్తుతంలోకి వచ్చి అమెరికాలో ఉన్న కృష్ణకాంత్ కూతురు ఆద్య(శృతిహాసన్) తండ్రికి చెప్పకుండా ఇండియాకు వస్తుంది. దీంతో ఆమెని చంపడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తన కూతురిని కాపాడేది దేవా(ప్రభాస్) ఒక్కడే అని అతన్ని సహాయం అడుగుతారు. దేవా మెకానిక్ గా, అతని తల్లి(ఈశ్వరరావు) టీచర్ గా అస్సాం దగ్గర బొగ్గు గనులు ఉన్న ఓ ఊర్లో ఉంటారు. ఆద్య అక్కడ ఉందని తెలియడంతో ఆద్యని వెతుకుతున్న గ్యాంగ్ లు అన్ని అక్కడికి వచ్చి ఆద్యని తీసుకెళ్లడానికి ప్రయత్నించగా దేవా ఆపుతాడు. దీంతో దేవా కథని అతని దగ్గర ఉండే బిలాల్(మైమ్ గోపి) ఆద్యకు చెప్తాడు.

అసలు దేవా ఎవరు? ఖాన్సార్ ప్రపంచం ఏంటి? ఖాన్సార్ మనుషులు ఎందుకు ఆద్యని వెతుకుతున్నారు? ఆద్యని దేవా కాపాడాడు అని తెలిసిన తర్వాత ఎందుకు ఖాన్సార్ మనుషులు భయపడ్డారు? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి? వరదరాజ మన్నార్(పృథ్వి రాజ్ సుకుమారన్) దేవా మళ్ళీ ఎందుకు కలిశారు? వరద కోసం దేవా ఎవర్ని ఎదుర్కున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ..
మొదటి హాఫ్ లో హీరో, అతని తల్లి ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియకుండా బతకడం, హీరో చాలా ప్రశాంతంగా ఉండటం, హీరో చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసినా తల్లి భయపడటం, హీరోని ఎవరు ఏమన్నా సైలెంట్ గా వెళ్లిపోవడం.. ఇలా హీరోకీ ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది, తన తల్లి కోసం ఇలా మారిపోయాడు అని చూపించారు. ఇలా ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ గానే సాగుతుంది. ఇంటర్వెల్ కి ఆద్యని ఎత్తుకుపోవడంతో తల్లే అతనికి అడ్డు తొలిగి కాపాడమంటుంది. దీంతో ఇంటర్వెల్ నుంచి ప్రభాస్ రెచ్చిపోయి యాక్షన్ మొదలు పెట్టడంతో సినిమాపై ఆసక్తి కలుగుతుంది.

ఇక సెకండ్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. చిన్నప్పుడు దేవాని వదిలేసిన వరద రాజమన్నార్ వచ్చి దేవాని సహాయం అడగడం, వరద రాజమన్నార్ రాజు కాకుండా అక్కడ ఉన్న వాళ్లంతా అడ్డుకోవడం, వాళ్ళతో దేవా పోరాడటంతో సెకండ్ హాఫ్ అంతా ఆసక్తిగా సాగుతుంది. అయితే ఆ ఖాన్సార్ ప్రపంచంలో వాడే పేర్లు, నిభందనలు, ఆ పదాలు, ఎక్కువ క్యారెక్టర్స్ అన్ని కొత్తగా అనిపిస్తాయి. నార్మల్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వవు. యాక్షన్ సీన్స్ లో మాత్రం ప్రభాస్ అదరగొడతాడు. చివర్లో అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఆ ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి ఒక్కసారిగా ఫుల్ హైప్ వస్తుంది. ఇక సినిమా మొత్తం ఎలివేషన్స్ కి ఢోకా లేదు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ గురించి, ప్రభాస్ గురించి ఎవరు తలచుకున్నా ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ ముందు ప్రభాస్ కి భారీ ఎలివేషన్స్ ఇచ్చాడు. అయితే యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ కి కూడా డైరెక్టర్ ప్రాధాన్యత ఇచ్చాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా తల్లి – కొడుకు ఎమోషన్స్ ఉంటే, సెకండ్ హాఫ్ లో ఫ్రెండ్స్ ఎమోషన్ కూడా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు.

Also Read : Salaar Twitter Review : సలార్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

నటీనటుల విషయానికొస్తే..
ప్రభాస్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్. తన కటౌట్ కి తగ్గ యాక్షన్ సీన్స్ పడటంతో అదరగొట్టాడు, కానీ ప్రభాస్ సినిమా మొత్తం ఎక్కువగా మాట్లాడడు, ఇది అభిమానులకు కొంచెం నిరాశ కలిగిస్తుంది. శృతి హాసన్ అమెరికా నుంచి వచ్చి ఆపదలో ఇరుక్కున్న అమ్మాయిగా బాగానే నటించింది. పృథ్విరాజ్ సుకుమారన్ కూడా చాలా సెటిల్డ్ క్యారెక్టర్ తో మెప్పిస్తాడు. జగపతి బాబు, బాబీ సింహ, టిన్ను ఆనంద్, మైమ్ గోపి, ఈశ్వరరావు, శ్రియ రెడ్డి, ఝాన్సీ.. ఇలా అందరూ తమ పాత్రల్లో అదరగొట్టారనే చెప్పొచ్చు.

టెక్నికల్ అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రశాంత్ నీల్ గత సినిమాల్లో లాగానే బ్లాక్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బాగా ఇస్తే బాగుండు అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ 2లో యాక్షన్ సీన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయని అర్ధమవుతుంది. దర్శకుడిగా ప్రశాంత్ నీల్ సక్సెస్ అయినప్పటికీ.. కథనం అంతా KGF లాగే ముందుకు, వెనక్కు, వాయిస్ ఓవర్స్ తో ఉండటంతో మళ్ళీ అలాంటి సినిమానే అన్న ఫీల్ వస్తుంది. ఒక రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి.

మొత్తంగా సలార్.. ఫ్రెండ్ కష్టంలో ఉన్నాడని అతని కోసం ఏమైనా చేసే ఓ స్నేహితుడి కథకు చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2పై అంచనాలు పెంచారు. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడు వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.