Ram Gopal Varma: బిగ్ షౌట్ అవుట్.. బాహుబలి తరువాత మిరాయ్.. రామ్ గోపాల్ వర్మ క్రేజీ ట్వీట్

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది(Ram Gopal Varma). సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

Ram Gopal Varma made a crazy post on social media about the movie Mirai

Ram Gopal Varma: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ మిరాయ్ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సినిమాలో కథ, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్.. ఇలా ప్రతీ విషయంలో మిరాయ్ ఆడియన్స్ ను ఒక రేంజ్ సాటిస్ఫై చేసింది. ఆడియన్స్ కూడా సినిమా హాలీవుడ్ రేంజ్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా మిరాయ్ గురించే చర్చ నడుస్తోంది. మొదటిరోజు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Actress: రూ.21 లక్షల బైక్ కొన్న బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్.. రజినీతో సాంగ్ చేసి ట్రేడ్ సెట్ చేసింది గుర్తుందా?

ఇదిలా ఉంటే, తాజాగా మిరాయ్ సినిమాపై సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను బాహుబలి సినిమాతో పోల్చుతూ క్రేజీ కామెంట్స్ చేశారు. “మిరాయ్ తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని, విశ్వప్రసాద్ లకి పెద్ద షౌట్ అవుట్. బాహుబలి తరువాత ఇలా ఏకపక్షంగా ప్రశంసలు దక్కడం అనేది మిరాయ్ కే జరిగింది. సినిమాలో వీఎఫెక్స్, కథనం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి” అంటూ పోస్ట్ పెట్టారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మిరాయ్ సినిమా విషయానికి వస్తే, టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించాడు. మంచు మనోజ్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా పీపుల్ మీడియా బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ గౌర హరి సంగీతం అందించారు. ఇక సినిమాకు యునానిమస్ పాజిటీవ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది అంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.