‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌కు రేటు ఫిక్స్ చేసిన ఆర్జీవీ..

కాంట్రవర్సీ కింగ్ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వపర్‌స్టార్’. ఈ నెల 22న ఈ సినిమా ట్రైలర్‌ను తన ఆర్జీవీ వరల్డ్ డాట్ కామ్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ‘పవర్‌స్టార్’ ట్రైలర్‌ను చూడాలనుకుంటే రూ.25 చెల్లించి చూడాలని తెలిపారు వర్మ. ఈ విషయంపై ఆర్జీవీ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈసారి దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’పై ఫోకస్ పెట్టాడు.
‘‘అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం డబ్బులు చెల్లించి కూడా చూడటానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఎవరైతే ‘బాహుబలి’ చిత్రాన్ని చూశారో వారు ‘RRR’ సినిమా ట్రైలర్‌ను డబ్బులు చెల్లించి చూస్తే చాలు.. నిర్మాతలకు లాభాలు వచ్చేస్తాయి. సాధారణంగా ట్రైలర్ చూడగానే సినిమా బిజినెస్ పూర్తవుతుందని అంటారు. కానీ రాజమౌళి విషయంలో అలా ఉండదు. సినిమా కంటే ఎక్కువగా ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ ట్రైలర్‌ను చూడటానికి ఆన్‌లైన్‌లో ప్రేక్షకులు సాధారణ టికెట్ రేటును పెట్టినా చెల్లించి చూడటానికి సిద్ధంగా ఉన్నారు. ట్రైలర్ రేటు రూ.150 లేదా 200 లు పెట్టొచ్చు. ఇప్పుడంతా ఆన్‌లైన్‌కే ప్రపంచమంతా మారుతోంది. కాబట్టి రాజమౌళి.. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. ఆన్‌లైన్ మార్కెట్ అనేదే ఇప్పుడు అసలైన మార్కెట్. మేమంతా ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌ను డబ్బులు పెట్టి చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అంటూ ట్వీటాడు ఆర్జీవీ.