Ram Gopal Varma Planning to create new movies with talented people in RGV Den and create new cinema world
RGV DEN : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(Rgv) ఒకప్పుడు టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) లో సూపర్ హిట్ సినిమాలు అందించి గత కొన్నాళ్ల నుంచి మాత్రం నా ఇష్టం అంటూ ఏవేవో సినిమాలు చేస్తున్నాడు. అయినా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్(Youtube) లో తన ఫిలాసఫీ మాటలతో అందర్నీ ఇంప్రెస్ చేస్తూ ఉంటున్నాడు. అతన్ని పొగిడేవాళ్లు ఎంతమంది ఉన్నా అతన్ని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆర్జీవీ అవేమి లెక్క చేయకుండా తన పని తాను చేసుకుపోతాడు.
ఇటీవల ఆర్జీవీ కొత్త ఆఫీస్ కట్టాను అంటూ ‘ఆర్జీవీ డెన్’ వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఆ ఆఫీస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా RGV డెన్ వైరల్ గా మారింది. ఆర్జీవీ డెన్ అనే పేరుతోనే ఆర్వీ గ్రూప్ తో కలిసి ఓ నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. ఈ ఆర్జీవీ డెన్ తో ట్యాలెంట్ ఉన్నవాళ్లకు, కొత్తవాళ్లకు సినిమా, వెబ్ సిరీస్ లలో అవకాశాలు ఇస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా అవకాశాలు ఎలా ఇస్తారో, ఎలా అప్లై చేయాలో తెలుపుతూ ఆర్జీవీ ప్రకటించారు. ఆర్జీవీ డెన్ కి ఒక వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో డైరెక్టర్స్, రైటర్స్, కెమెరామెన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. మిగిలిన కేటగిరీలలో కూడా త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని అన్నారు. ట్యాలెంట్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆ వెబ్‌సైట్ కి వెళ్లి అప్లై చేసుకోండని ఆర్జీవీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే ఆర్జీవీ డెన్, ఈ ఆఫర్స్ గురించి, అవకాశాల గురించి ఆర్జీవీ వరుస పోస్టులు చేస్తున్నాడు. గతంలో పలు ఇంటర్వ్యూలలో కూడా ఆర్జీవీ కొత్త ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి, ఆర్జీవీ డెన్ స్థాపించి చాలా మందితో సినిమాలు తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నట్టు తెలిపాడు. ఇపుడు ఆర్జీవీ తన సొంత టీంని రెడీ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉండి అవకాశాలు రాని వాళ్ళు, ఇండస్ట్రీలో రాజకీయాలకు బలయ్యే వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఆర్జీవీ డెన్ కి వస్తారని అంటున్నారు.
సినిమా పరిశ్రమలోని అన్ని కేటగిరీలలో ట్యాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని, వారితో సినిమాలు, సిరీస్ లు తెరకెక్కించబోతున్నాడు ఆర్జీవీ. అసలు ఒక సినిమాకి తనకేమి కావాలో బయటకి వెళ్లి తెచ్చుకోకుండా ఆర్జీవీ తన దగ్గరికే ట్యాలెంట్ ఉన్నవాళ్ళని రప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు. ఎంతమంది వచ్చినా వాళ్ళతో సినిమాలు, సిరీస్ లు తీయడానికి ఆర్జీవీ రెడీగా ఉన్నాడట. ఇందుకు డబ్బులు కూడా బాగానే అరేంజ్ చేసినట్టు సమాచారం. దీంతో ఆర్జీవీ తన సొంత సినీ పరిశ్రమ సృష్టించుకుంటున్నాడని, తనకి అవసరం వచ్చిన టెక్నీషియన్స్ ని బయట నుంచి తెచ్చుకోకుండా తన దగ్గరికే రప్పించుకుంటున్నాడని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
ఆర్జీవీ డెన్ ఈ కాన్సెప్ట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మెల్లిగా మొదలైనా తర్వాత ఇది చాలా పెద్దదిగా మారుతుందని, కొన్ని వందల మంది ఆర్జీవీ డెన్ లోకి వస్తారని, అక్కడ సపరేట్ సినిమా ప్రపంచం నిర్మిస్తారని ఆర్జీవీ అనుచరులు అంటున్నారు. ఆర్జీవీ డెన్ కట్టినప్పుడు నా డ్రీమ్ అని ఆర్జీవీ తెలిపాడు. దీంతో సినిమాలు తనకి నచ్చినట్టు ఇన్నాళ్లు చేసిన ఆర్జీవీ ఇకపై ట్యాలెంట్ ఉన్నవాళ్ళకి అవకాశాలు ఇస్తూ సినిమాలు నిర్మిస్తూ, ఆ సినిమాలని పర్యవేక్షిస్తూ ఉండిపోతాడా అని సందేహం కూడా వ్యక్తం అవుతుంది. ఏదైనా ఆర్జీవీ ఒక మంచి పనికే శ్రీకారం చుట్టాడు. మరి దీంతో ఎన్ని సినిమాలు, సిరీస్ లు, ఎంతమంది ట్యాలెంట్ డైరెక్టర్స్ వస్తారో చూడాలి.