RGV : అందరూ చేస్తున్నారు.. నేను ఎందుకు చేయకూడదు.. ఆర్జీవీ కూడా..

ఆర్జీవీ తాజాగా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.

Ram Gopal Varma RGV ready to Re Release his First Movie Nagarjuna Shiva

RGV : ఒకప్పుడు తన సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ఆర్జీవీ ఇప్పుడు తన ట్వీట్స్ తో సృష్టిస్తున్నాడు. ప్రతిదీ కొత్తగా ట్రై చేసే ఆర్జీవీ తాజాగా వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇటీవల పాత సినిమాలు అన్ని రీ రిలీజ్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు స్టార్ హీరోల సినిమాలు, బిగ్గెస్ట్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేశారు. రాను రాను ఫ్లాప్ సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల రీ రిలీజ్ అయ్యే సినిమాలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు రీ రిలీజ్ ఎందుకు అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అందరూ ఇష్టమొచ్చినట్టు పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తుండటంతో నేనెందుకు చేయకూడదు అనుకున్నాడో ఏమో ఆర్జీవీ కూడా తన సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు.

Also Read : Sharwanand – Kartikeya : శర్వానంద్ కాళ్లకు దండం పెట్టిన కార్తికేయ.. వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు..

ఆర్జీవీ తన మొదటి సినిమా నాగార్జున ‘శివ’తో ఇండస్ట్రీలో భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టడమే కాక సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చాడు ఆర్జీవీ. ఇప్పటికి ఆర్జీవీ గురించి చెప్పాలంటే శివ సినిమా గురించే ఫస్ట్ చెబుతారు. అందుకే తన మొదటి సినిమా శివని రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు ఆర్జీవీ.

శివ సినిమాలో నాగార్జున సైకిల్ చైన్ లాగే పవర్ ఫుల్ సీన్ లో నాగార్జున ఫేస్ కు తన ఫేస్ పెట్టి వీడియో రిలీజ్ చేసి ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో ఈ వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక శివ రీ రిలీజ్ చేస్తానని చెప్పడంతో సినిమా లవర్స్ ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని ఎదురుచూస్తున్నారు.