Ram Gopal Varma supports Chiranjeevi over conflict with Vijayasai Reddy
Ram Gopal Varma – Chiranjeevi : ఇటీవల చిరంజీవి వైసీపీ (YCP) నేత ఎంపీ విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) పార్లమెంట్ లో మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపాయి. సినిమాటోగ్రఫీ చట్ట బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యూనరేషన్ మేజర్ రోల్ పోషిస్తుందని, 50 శాతం వారికే వెళ్తుందని, దానివల్ల సినీ కార్మికులకు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఇక దీనిపై చిరు రియాక్ట్ అవుతూ.. ‘పిచుక పై బ్రహ్మాస్త్రంలా మాటిమాటికి సినీ పరిశ్రమ పై పడతారేంటి’ అని కౌంటర్ ఇచ్చాడు. చిరు వ్యాఖ్యలకు వైసీపీలోని నాయకులంతా కౌంటర్ ఇస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు.
Ram Gopal Varma : వివేకా కేసులోని నిందుతుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?
ఇక తాజాగా ఈ కాంట్రవర్సీ పై సెన్సేషన్ డైరెక్టర్ వర్మ రియాక్ట్ అయ్యాడు. “హీరోలకు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడంలో పెద్ద తప్పేమి లేదు. వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇస్తున్నారు. అలా నాకు ఇచ్చినా నేను తీసుకుంటా. అక్కడ ఇచ్చేవాడిది తప్పు గాని తీసుకునే వాడి తప్పు ఎలా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల, పెట్టిన బడ్జెట్ ని రాబట్టుకునేందుకు టికెట్ రేట్స్ పెంచాల్సి వస్తుందని, ఆ భారం ప్రజలు పై పడుతుందనేది కూడా పూర్తిగా తప్పు. నేను ఒక వస్తువుని ఒక రేటుతో మార్కెట్ లోకి తీసుకు వచ్చా. నేను పెట్టిన రేటుకి ఆ వస్తువు కరెక్ట్ అనుకుంటే కొంటారు, లేకపోతే కొనరు.. ఇది అంతే. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 20-40 కోట్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక్కడ కోట్ల బడ్జెట్ తో వస్తున్నాయంటే తెలుగు సినిమాలు, స్టార్స్ కి ఉన్న మార్కెట్ వేరు” అంటూ చెప్పుకొచ్చాడు.
Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?
అయితే ఈ వ్యాఖ్యలు వైసీపీ నేతల మాటల్ని కొట్టిపడేసేలా ఉన్నాయి. హీరోల రెమ్యూనరేషన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం గత కొంతకాలంగా విమర్శిస్తూ వస్తుంది. కానీ వర్మ మాత్రం వారు చేసే వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదన్నట్లుగా చెప్పుకు రావడంతో ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.