Ram Gopal Varma who responded to the cases against him video goes viral
Ram Gopal Varma : ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు ఈయన. ఇక ఈయన సినిమాలు సైతం వివాదాత్మకంగానే ఉంటాయి. ఏదో ఒక గొడవ జరిగే విధంగానే సినిమాలు తీస్తుంటారు ఆర్జీవీ. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాల్లో ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తుంటారు.
అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు ఆయన వ్యూహం సినిమా తెరకెక్కించారు. ఇక ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి కొన్ని చెయ్యకూడని కామెంట్స్ చేశారు. గౌరవం లేకుండా వారికి సంబందించిన కొన్ని సీన్స్ ను సినిమాలో వారి అనుమతి లేకుండా వాడుకున్నారు. ఇక ఆ సీన్స్ అవమానకరంగా ఉండడంతో కూటమి విజయం తర్వాత ఆర్జీవీ పై పలు కేసులు నమోదు చేసారు. ఇందుకుగాను ఆయనకి నోటీసులు అందించారు. అయితే దీనిపై స్పందించకుండా ఉండడంతో కూటమికి ఆర్జీవీ బయపడుతున్నాడు, దాక్కున్నాడు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన్ని ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read : Aditi Rao Hydari-Siddharth : అప్పుడు సింపుల్ గా.. ఇప్పుడు గ్రాండ్ గా.. మళ్ళీ పెళ్లి చేసుకున్న సిద్దార్థ్..
అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు ఆర్జీవీ. “తను ఏ కేసులకు భయపడి ఏడవడం లేదని, తనకి వచ్చిన నోటీసులకు చట్టపరమైన సమాధానం ఇచ్చానని, ఈ నోటీసులకు భయపడి ఏడుస్తునట్టు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని, నిజానికి ఆయన ఏడాది క్రితం వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో చేసిన ట్వీట్స్ వల్ల అసలైన వ్యక్తులు కాకుండా ఇతరుల మనోభావాలు దెబ్బతినడమేంటని, అసలైన వ్యక్తులు కాకుండా ఇతరులు తనపై కేసు పెట్టడమేంటని, రాజకీయ నాయకులు పోలీసులని ఆయుధాల్లా ఉపయోగించుకుంటుంన్నారు అని.. తను అధికారులని ఎవ్వరినీ నిందించడంలేదని, అసలు తనపై పెట్టిన ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి” అని పేర్కొన్నారు.