Ram Lakshman
Ram Lakshman : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి టాప్ ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు రామ్ లక్ష్మణ్. ఇద్దరూ కవలలు, చూడటానికి అచ్చు ఒకేలా ఉంటారు. ఎన్ని సార్లు చూసినా ఎవరు రామ్ – ఎవరు లక్ష్మణ్ గుర్తు పట్టడం కష్టమే. రామ్ లక్ష్మణ్ ఇద్దరూ తెలుగులో టాప్ స్టార్స్ తో వర్క్ చేశారు.(Ram Lakshman)
రామ్ లక్ష్మణ్ తాజాగా బాలయ్య బాబు అఖండ 2 సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇటీవల టీజర్, ట్రైలర్స్ లో బాలయ్య బాబు ఫైట్స్ చూస్తే కొత్తగా, వెరైటీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ లక్ష్మణ్ ఇద్దరూ ఎప్పుడు కనపడినా ఒకే రకం డ్రెస్ లు వేస్తారు. ఒకేలా కనిపిస్తారు. ఇద్దరూ ఒకే రకం కౌ బాయ్ క్యాప్స్ పెట్టుకుంటారు. తాజాగా అఖండ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ క్యాప్స్ గురించి తెలిపాడు.
Also See : Vanara Teaser : ‘వానర’ టీజర్ రిలీజ్.. బండి కోసం వానరులు ఇంత పోరాటమా? నందు విలన్ గా..
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మేము డ్రెస్ ల మీద ఎక్కువే ఫోకస్ చేస్తాము. మేము వాడిన డ్రెస్ మళ్ళీ ఎక్కువగా వాడము. ఆ డ్రెస్ లు అన్ని ఎవరికో ఒకరికి ఇస్తూ ఉంటాము. ఈ కౌ బాయ్ క్యాప్ ఊరికే పెట్టలేదు. దీంతో ఒక మెమరీ ఉంది. మమ్మల్ని సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చింది మా గురువు గారు రాజు మాస్టర్. మహానుభావుడు. ఆయన క్యాప్ పెట్టుకునేవాడు. ఆయన గుర్తుగా పెట్టుకోవాలని అనుకున్నాం. అది అలా అలవాటు అయింది. ఇప్పుడు క్యాప్ లేకుండా ఉంటే మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టట్లేదు. అందుకే ఈ క్యాప్ ని మాకు గుర్తుగా, ఆయన జ్ఞాపకంగా పెట్టుకుంటున్నాము అని తెలిపారు.
Also See : Samyuktha – Aniruda Srikkanth : రెండో పెళ్లి చేసుకున్న CSK మాజీ క్రికెటర్ – నటి.. ఫొటోలు వైరల్..