Ram Lakshman - Chiranjeevi
Ram Lakshman – Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సినీ పరిశ్రమలో కూడా ఎంతోమంది చిరు అభిమానులే. టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కూడా అన్నయ్య అభిమానులే. తాజాగా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవికి తాము ఎంత పెద్ద అభిమానులమో చెప్తూ చిరు అంటే ఎంత ప్రేమో తెలిపారు.
Also Read : Santhosh Balaraj : కన్నడ హీరో కన్నుమూత.. 34 ఏళ్ళ వయసులోనే..
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగాం. ఆయన అభిమానులం మేము. థియేటర్లో ఆయన్నే చూసేవాళ్ళం. సినిమాల్లో ఆయన ఉంటే పక్కన హీరోయిన్ ని కూడా చూసేవాళ్ళం కాదు. మాకు ఫేవరేట్ హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. అందుకు కారణం చిరంజీవి గారే. ఆయన సినిమాలు చూస్తూ ఆయనకు అభిమానులం అయిపోయి హీరోయిన్స్ ని పట్టించుకోలేదు అని అన్నారు.
అలాగే.. చిరంజీవి అన్నయ్యని చూడటానికి చెన్నై వచ్చేసాం. చెన్నైలో ఆయన్ని చూడటానికి ఆరు నెలలు పట్టింది. ఆయన్ని ఖైదీ నెంబర్ 786 సినిమా షూటింగ్ లో మొదటిసారి చూసాం. అంతకుముందు జేబు దొంగ సినిమా షూటింగ్ కి వెళ్ళాం కానీ ఆయన్ని చూడటం కుదరలేదు. లంకేశ్వరుడు సినిమాలో చిరంజీవితో మొదటిసారి ఫైటర్స్ గా చేసాము. ఖైదీ నెంబర్ 150 సినిమాకు మొదటి సారి అన్నయ్యకు ఫైట్ మాస్టర్స్ గా చేసాము. అన్నయ్యని చూస్తే చాలు అనుకున్నాం. కానీ ఆయనతో ఫైట్ చేసి, ఆయనకు ఫైట్ చేయించాము అని తెలిపారు.