×
Ad

Skanda Collections : అదిరిపోయిన ‘స్కంద’ ఫస్ట్ డే కలెక్షన్స్.. రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్.. .

స్కంద సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య కూడా వచ్చి సినిమాని ప్రమోట్ చేశారు. దీంతో మొదటి రోజే భారీగా రామ్, బాలయ్య, బోయపాటి అభిమానులు, మాస్ ఆడియన్స్ స్కంద సినిమా కోసం థియేటర్లకు పరుగులు తీశారు. దీంతో స్కంద సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.

  • Published On : September 29, 2023 / 12:29 PM IST

Ram Pothineni Boyapati Srinu Skanda Movie First Day Collections Ram Career best Openings

Skanda Collections :  మాస్ ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu), ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) కాంబోలో తెరకెక్కిన ఊర మాస్ సినిమా ‘స్కంద‌’. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్ ని ఇప్పటివరకు చూడనంత మాస్ గా చూపించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించగా శ్రీకాంత్, పృథ్వీ, ఇంద్రజ, గౌతమి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. స్కంద ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి, B C సెంటర్స్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. బోయపాటి తన మాసిజాన్ని ఈ సారి మరింత డబల్ చేయగా రామ్ యాక్టింగ్ తో అదరగొట్టాడు.

స్కంద సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య కూడా వచ్చి సినిమాని ప్రమోట్ చేశారు. దీంతో మొదటి రోజే భారీగా రామ్, బాలయ్య, బోయపాటి అభిమానులు, మాస్ ఆడియన్స్ స్కంద సినిమా కోసం థియేటర్లకు పరుగులు తీశారు. దీంతో స్కంద సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి.

Also Read : RGV : వర్మ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆ అమ్మాయితో ‘చీర’ సినిమా తీస్తానంటున్న ఆర్జీవీ..

స్కంద సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 18.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే దాదాపు 9 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో స్కంద కలెక్షన్స్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచాయి. స్కంద సినిమాకు దాదాపు 40 కోట్ల థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 30 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి.