RGV : వర్మ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆ అమ్మాయితో ‘చీర’ సినిమా తీస్తానంటున్న ఆర్జీవీ..

మొత్తానికి ఆర్జీవీ ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయి దొరికింది అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా పోస్టు చేశాడు. తాజాగా ఆ అమ్మాయి రీల్స్ లో ఉన్న మరో చీర కట్టుకున్న వీడియోని షేర్ చేసి...

RGV : వర్మ వెతుకుతున్న అమ్మాయి దొరికేసింది.. ఆ అమ్మాయితో ‘చీర’ సినిమా తీస్తానంటున్న ఆర్జీవీ..

RGV find a girl that who impressed him in saree and he wants to do movie with her

RGV : రామ్ గోపాల్ వ‌ర్మ‌(Ram Gopal Varma)ని ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు సూపర్ హిట్ సినిమాలతో అందర్నీ మెప్పించిన ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తన ఇష్టం అంటూ తనకి నచ్చినట్టు సినిమాలు చేస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ట్వీట్స్, పోస్టులు పెట్టి వైరల్ అవుతూ ఉంటాడు వర్మ. ఇటీవల ఒక చీర కట్టుకున్న అమ్మాయి రీల్ వీడియో పోస్ట్ చేసి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే చెప్పండి అని పోస్ట్ చేశాడు.

ఇంకేముంది రాత్రికి రాత్రి ఆ అమ్మాయి వైరల్ అయిపొయింది. మొత్తానికి ఆర్జీవీ ఆ అమ్మాయిని కనిపెట్టి ఆ అమ్మాయి దొరికింది అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్ కూడా పోస్టు చేశాడు. తాజాగా ఆ అమ్మాయి రీల్స్ లో ఉన్న మరో చీర కట్టుకున్న వీడియోని షేర్ చేసి.. కొంతమంది చీర అందమైన డ్రెస్ అని చెప్తూ ఉంటారు. ఆ విషయం నేను ఈ వీడియో చేసేవరకు నమ్మలేదు. ఈమె నన్ను ‘శారీ'(చీర) అనే సినిమా తీసేలా మోటివేట్ చేసింది. ఆమెతోనే ఆ సినిమా తీస్తాను అని పోస్ట్ చేశాడు.

దీంతో ఆర్జీవీ పోస్ట్ వైరల్ అయింది. ఆ అమ్మాయి కూడా ఒక్కసారిగా వైరల్ అయిపొయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే.. మళయాళంకి చెందిన శ్రీలక్ష్మి సతీష్ అనే ఆర్టిస్ట్. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు ట్రై చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తుంది. ఆర్జీవీ ఇలా తన వీడియోలు పోస్ట్ చేయడం వైరల్ అయి ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. మలయాళం న్యూస్ లో కూడా ఈ వార్త రావడంతో శ్రీలక్ష్మి కూడా ఆర్జీవీ పోస్ట్ చేసిన తన వీడియోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. తపై ఆర్జీవీ చేసిన కామెంట్స్ వార్తలని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Also Read : Salaar : సలార్ అధికారిక రిలీజ్ డేట్ వచ్చేసేంది.. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ ఫిక్స్..

మొత్తానికి ఆర్జీవీ వల్ల ఇంకో అమ్మాయి స్టార్ కాబోతుంది. ఇప్పటికే ఆమెకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఆర్జీవీ మరి నిజంగానే ఆమెతో సినిమా తీస్తాడా చూడాలి. ఆర్జీవీ పరిచయం చేసిన అమ్మాయిలు ఇప్పుడు బాగానే అవకాశాలు, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేసుకుంటూ సంపాదిస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే నటిగా ట్రై చేస్తున్న ఈ అమ్మాయి శ్రీలక్ష్మి సతీష్ కూడా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందా చూడాలి.