Ram Pothineni: ఇస్మార్ట్‌గా తన నెక్ట్స్ మూవీని కన్ఫం చేసిన రామ్..!

యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

Ram Pothineni Next Movie With Puri Jagannadh

Ram Pothinen: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 20వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి ఊరమాస్ కథాంశంతో చిత్ర యూనిట్ తెరకెక్కి్స్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో రామ్ సరికొత్త ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడట.

Ram Pothineni : రామ్, బోయపాటి మూవీ గ్లింప్స్‌కి డేట్ ఫిక్స్.. టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ఇక ఈ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ప్రశ్న గతకొంత కాలంగా టాలీవుడ్‌లో నెలకొంది. అయితే, ఇటీవల తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రామ్ రెడీ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా, ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను చేశారు మేకర్స్.

Ram Pothineni: రీ-రిలీజ్‌కు ‘రెడీ’ అంటోన్న రామ్.. ఎప్పుడు వస్తున్నాడో తెలుసా?

పూరీ డైరెక్షన్‌లో గతంలో ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించిన రామ్, తన నెక్ట్స్ మూవీని కూడా ఆయన డైరెక్షన్‌లో చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. దీంతో ప్రేక్షకుల్లో ఈ కాంబినేషన్‌పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈసారి ఈ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రానుందా.. ఈ సినిమాను అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.