Site icon 10TV Telugu

Ramabanam Movie : ఇదెక్కడి ప్రమోషన్స్ రా నాయనా.. పాల ప్యాకెట్లు, చలివేంద్రాలతో రామబాణం ప్రమోషన్స్..

Ramabanam Movie different promotions goes viral

Ramabanam Movie different promotions goes viral

Ramabanam Movie :  గోపీచంద్(Gopichand) మే 5న రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

ఇక గత కొద్ది రోజులుగా రామబాణం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఓ పక్క ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూనే ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు చిత్రయూనిట్. ఇక హీరోయిన్ డింపుల్ పలువురు ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్ పీపుల్స్ తో కలిసి డ్యాన్సులు, రీల్స్ చేస్తుంది. తాజాగా నిర్మాణ సంస్థ కొత్త రకం ప్రమోషన్స్ చేస్తుంది.

AR Rahman : స్టేజి మీద పాడుతుండగానే AR రెహమాన్ ప్రోగ్రాంని ఆపేసిన పోలీసులు..

పొద్దున్నే అందరి ఇళ్లకు వెళ్లే పాల ప్యాకెట్స్ మీద రామబాణం స్టిక్కర్స్ అంటించి తమ సినిమాని ఇంటింటికి వెళ్లేలా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఈ పాల ప్యాకెట్స్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే రామబాణం పేరుతో చలివేంద్రం నిర్వహిస్తూ ఓ పక్కన సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరో పక్క సమ్మర్ లో దాహం తీరుస్తున్నారు. ఈ చలివేంద్రం గుంటూరులో ఏర్పాటు చేశారు. దీంతో ప్రమోషన్స్ కొత్తగా ఉన్నా బాగానే ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version