Ramajogayya
Ramajogayya Shastri : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వనుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్ని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా సినిమాని నిర్మించారు. ఆచార్య సినిమాకి సంబంధించి మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ(ఏప్రిల్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ ఈవెంట్ కి మెగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.
ఈ ఈవెంట్ లో గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ”లాహే లాహే పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. మణిశర్మ అన్నయ్య అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఉమా శంకరుల మధ్య ఉన్న శృంగార ఘట్టాన్ని, సంసార జీవితాన్ని తనకున్న చిన్న పరిధిలో రాయమని నాకు చెప్పిన కొరటాల శివ గారికి ఈ క్రెడిట్ ఇస్తాను. నా శాయశక్తులా ప్రయత్నించాను రాయడానికి. చిరంజీవి గారు నా పాటకి ఎప్పుడు డ్యాన్స్ వేస్తారు అని అనుకునే వాడ్ని. షూట్ అయ్యాక నాకు ఫోన్ చేసి ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడి అభినందించారు. అయన సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవకి ఆచార్య అని టైటిల్ కరెక్ట్ సరిపోతుంది. జనాలకి ఒక మంచి చెప్పాలి అని కొరటాల తన సినిమాల్లో అంతర్లీనంగా చెప్తూ తెరకెక్కిస్తారు. మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు ఈ సినిమాకి. రామ్ చరణ్ కెరీర్ లో మొదటి షూట్ నేను రాసిన పాటతోనే మొదలైంది. తండ్రి కొడుకులు కలిసి చేయడం మనకి కన్నుల పండుగగా ఉంది. సినిమా కోసం అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా దగ్గరి నుంచి మంచి పాటలు రాబట్టిన కొరటాల శివకి ధన్యవాదాలు. నన్ను ఆప్యాయయంగా చూసుకునే చిరంజీవి గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.
Rajamouli : కొత్త కార్ కొన్న దర్శకధీరుడు.. కాస్ట్ ఎంతో తెలుసా??
ఇప్పటికే ఈ సినిమా నుంచి లాహే లాహె, నీలాంబరి, సానా కష్టం, భలే భలే బంజారా లిరికల్ సాంగ్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయి భారీ స్పందన తెచ్చుకున్నాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.